
“అక్కడి రాజకీయాల్లో మా పాత్ర ఏమీ లేదు. తెరాసకు ఒక పార్టీగా ఏపీలో వేలుపెట్టాల్సిన అవసరం, పరిస్థితి, ఆసక్తి లేదు. తెదేపా, వైకాపా, జనసేనలతో ఏపీలో త్రిముఖ పోటీ ఉంది. ఆ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు, ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబును సాగనంపే ఆలోచనలో ఉన్నారు. ప్రజలను గోల్‌మాల్ చేసి ఓట్లు పొందాలని చూస్తున్నారు,” అని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు ఎవరిని గెలిపించాలనేది ప్రజల నిర్ణయం అంటూ తప్పుకున్నారు కేటీఆర్.
అదే సమయంలో చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. “ఎవరైనాన అయిదేళ్లు సీఎంగా పనిచేసి ఉంటే తాను చేసింది చెప్పాలి. మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పాలి. పాజిటివ్ ఓటు కోసం యత్నించాలి. మేం శాసనసభ ఎన్నికల్లో అదే చేశాం. మేం ఏపీ ప్రజలు, తెలంగాణ ప్రజలు అని ఎక్కడా వేర్వేరుగా చూడలేదు. వారి ప్రయోజనాల విషయంలో ఏనాడూ ఆటంకాలు కల్పించలేదు. అందరు బాగుండాలనుకున్నాం. మమల్ని బూచిగా చూపించి గెలవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎవరిని గెలిపించాలనేది ప్రజల నిర్ణయం,” అని అన్నారు కేటీఆర్.
The overseas performance of Dhurandhar: The Revenge has become a major talking point. The film…
అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా వాటికి ఆర్ధిక పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడే ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. విగ్రహాలు,…