
ఒకవేళ టిడిపి మళ్ళీ గెలిచి, చంద్రబాబు నాయుడే మరోసారి ముఖ్యమంత్రి అయ్యుంటే నేడు ఆంధ్రప్రదేశ్ మరోస్థాయిలో ఉండేది. ఈ పాటికి పోలవరం, అమరావతి రెండూ ఓ కొలిక్కి వచ్చి ఉండేవి. అప్పుడు తెలంగాణ నుంచే ఆంధ్రాకు పరిశ్రమలు, ఐటి కంపెనీలు తరలివచ్చేవి.
కానీ ప్రజలు చంద్రబాబు నాయుడుని కాదనుకొని జగన్మోహన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఏమి జరుగుతోందో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కృషి వల్ల కొంత ఏపీలో వైసీపి ప్రభుత్వ ధోరణి వలన మరికొంత తెలంగాణకు పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు క్యూ కడుతున్నాయి.
ఈ తొమ్మిదేళ్ళలో వాటిని చూసిచూసి అక్కడి ప్రజలకు అలవాటైపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే వార్త కానీ తెలంగాణకు వస్తే కాదు.
తాజాగా గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ రూ.16,650 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. రూ.3,500 కోట్ల పెట్టుబడితో కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన లూలు షాపింగ్ మాల్ ఇటీవలే ప్రారభోత్సవం జరిగింది. చిన్న పిల్లల దుస్తులు తయారు చేసే కైటెక్స్ కంపెనీ తెలంగాణలో మరోసారి రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఓవర్ హెడ్ టాంక్స్, పీవీసీ డోర్స్ వగైరా తయారుచేసే సింటెక్స్ కంపెనీ రూ.350 కోట్లు పెట్టింది.
వీటన్నిటికీ వరుసపెట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. గమ్మతైన విషయం ఏమిటంటే ఈ వార్తలన్నీ ఆత్మసాక్షిలోనే వస్తూనే ఉంటాయి. అసలు ఇన్ని పరిశ్రమలు, ఇంతంత భారీ పెట్టుబడులు తెలంగాణలోనే ఎందుకు? ఎవరూ ఏపీ వైపు తొంగిచూడటం లేదు ఎందువల్ల?అని ఎవరూ ఆలోచించే ఆసక్తి, తీరిక లేవు. ఎందుకో అందరికీ తెలుసు.
తెలంగాణ ఐటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ పేజీలో ఎక్కువగా పెట్టుబడులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబందించిన వివరాలు, ఫోటోలే కనబడుతుంటాయి. కానీ మన మంత్రిగారి పేజీలో ఏమి కనబడతాయి?మన మంత్రిగారు మీడియా ముందుకు వస్తే దేని గురించి మాట్లాడుతారో అందరికీ తెలుసు. అది తెలంగాణ ప్రజల అదృష్టం… ఇది మన ఖర్మ అంతే!
For decades, Jantar Mantar in Delhi has been an important location for public protests and…
గత కొన్ని రోజులుగా బీజేపీ టార్గెట్ గా ముఖ్యంగా మోడీ కార్నర్ గా ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాక్రోచ్ల రాజకీయం,…