
ఇందులో ఆంతర్యం ఏమిటో గానీ, టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు మధుర శ్రీధర్, సుధీర్ బాబు, దేవిశ్రీప్రసాద్, రకుల్ ప్రీత్ సింగ్, మెహ్రీన్, ప్రియదర్శి, రమణ గోగుల, లావణ్య త్రిపాఠి, మంచు లక్ష్మి, థమన్, షెంతిల్ కుమార్, అనిరుద్, శోభు యార్లగడ్డ, అక్కినేని అఖిల్, బ్రహ్మాజీ, ఈషా రబ్బా, మంచు విష్ణు, వెన్నెల కిషోర్, సమంత తదితరుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్నారు. సహజంగా తమ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులకు కూడా ఈ స్థాయిలో సినీ సెలబ్రిటీలు స్పందించరు.
ఏదో పవన్ కళ్యాణ్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి అగ్ర హీరోల జన్మదినోత్సవాలకు మాత్రమే ఈ రేంజ్ హంగామాను సోషల్ మీడియాలో చూడగలం. కానీ అందుకు విరుద్ధంగా టీఆర్ఎస్ యువనేత పుట్టినరోజును ప్రత్యేకంగా కొనియాడడం అంటే… అధికారం ప్రభావమేగా..! సర్కార్ లో ఉన్న నేతలను కాకా పట్టడం రొటీన్ గా రాజకీయాలలో జరిగేదే. అయితే ఈ సారి అది సినీ ఇండస్ట్రీకి కూడా పాకిందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. సినీ ఇండస్ట్రీ ‘సక్సెస్,’ రాజకీయాలలో ‘అధికారం’ కొత్త చుట్టాలను తీసుకువస్తుందన్న విషయం తెలియనిది కాదు.
సరిగ్గా కేటీఆర్ విషయంలోనూ ఇదే జరిగినట్లుగా కనపడుతోంది. దీంతో ఇప్పటివరకు కేటీఆర్ పేరెత్తని సినీ సెలబ్రిటీ కూడా పుట్టినరోజును తెలపడంలో ఉత్సాహం ప్రదర్శించారు. తెలంగాణాలో తదుపరి ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఇప్పటినుండే కేసీఆర్ తనయుడికి పట్టాభిషేకం చేయడంలో సినీ పరిశ్రమ మునిగి తేలుతోందన్న విషయం ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. సహజంగా రాజకీయాలకు దూరంగా ఉండే హీరోయిన్లు కూడా కేటీఆర్ కు ఆత్మీయ శుభాకాంక్షలు తెలపడం విశేషమే..!
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…