
కుప్పం పేరు వినగానే దశాబ్దాలుగా రాజకీయంగా గుర్తుకు వచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే మాజీ సిఎం జగన్, కుప్పంలో అభివృద్ధి పనులు చేయడం ద్వారా, చంద్రబాబు నాయుడిని అయన సొంత నియోజకవర్గంలోనే దెబ్బ తీయాలనుకున్నారు. అటువంటి రాజకీయ లక్ష్యంతో పనులు చేపట్టినందున జగన్ ఆశించిన ఫలం దక్కలేదు. కనీసం కుప్పం అభివృద్ధి చేయలేకపోయారు.
కానీ ఇప్పుడు కుప్పం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు రాజకీయకోణంలో కాకుండా తన నియోజకవర్గాన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. కుప్పం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహద్దులకు సమీపంలో ఉండటం, బెంగళూరు, చెన్నై నగరాలకు దగ్గరగా ఉండటం చాలా కలిసి వచ్చింది.
ఈ భౌగోళిక అనుకూలతతో పాటు కుప్పం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో పారిశ్రామికవేత్తలు బారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు.
ఒక్క కుప్పం నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏబీఐఎస్ ప్రోటీన్స్, శ్రీజా ఇంటిగ్రేటెడ్ డెయిరీ అండ్ క్యాటిల్ ఫీడ్ ప్లాంట్, ఏస్ ఇంటర్నేషనల్, ఎస్‌వీఎఫ్ సోయా, మదర్ డెయిరీ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
పాదరక్షల తయారీ రంగంలో హ్వాసెంగ్ ఫుట్‌వేర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో హిందాల్కో, ఇన్ ఫేజ్ పవర్ టెక్నాలజీస్ సంస్థలు తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయి.
టెక్స్‌టైల్ రంగంలో ఎంఏఎఫ్ క్లోతింగ్‌తో పాటు మరికొన్ని సంస్థలు కూడా కుప్పం వైపు అడుగులు వేస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ రంగంలో ఈ-రాయిస్ ఈవీ, ఎన్‌పీఎస్‌పీఎల్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ వంటి సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.
ఇప్పటికే ఈ ప్రాజెక్టుల్లో చాలా వరకు భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ పనుల దశలోకి ప్రవేశించాయి. కొన్ని సంస్థలు గ్రౌండ్‌వర్క్ పూర్తి చేసి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నాయి.
వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఈ పెట్టుబడుల ద్వారా కుప్పం నియోజకవర్గంలోనే లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. కుప్పంలో జరుగుతున్న ఈ పారిశ్రామీకరణ స్థానిక ప్రజలకు మాత్రమే కాకుండా చిత్తూరుతో పాటు సీమ జిల్లాల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది.
ఒకప్పుడు రాజకీయ పోరాటాలకు కేంద్రంగా నిలిచిన కుప్పం, ఇప్పుడు పారిశ్రామిక ప్రగతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. కనుక కుప్పంలో చంద్రబాబు నాయుడుని బీట్ చేయడం ఇక ఎన్నటికీ వైసీపీ వల్ల సాధ్యం కాదనే భావించవచ్చు.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…