Telugu

కర్నూల్ ఎమ్మెల్సీ సీట్ పై వైకాపాకు ఇంకా ఆశ ఉందా?

కర్నూల్ ఎమ్మెల్సీ సీట్ కు జరగబోతున్న ఉపఎన్నికకు దూరంగా ఉండబోతున్నట్టు వైకాపా ప్రకటించింది. నామినేషన్ గడువు ముగియడంతో అది ఖరారు అయిపోయింది. టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్‌తో సహా మొత్తం నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ నుంచి దండు శేషుయాదవ్‌, ఇండిపెండెంట్లుగా బైరెడ్డి అనుచరుడు పుల్యాల నాగిరెడ్డి, పులి జయప్రకాష్‌రెడ్డి నామినేషన్లు వేశారు.

బీఎస్పీ అభ్యర్ధి శేషుయాదవ్ నామినేషన్ తిరస్కరించారు. అభ్యర్ధిని బలపరుస్తూ చేసిన సంతకం ఫోర్జరీగా తేల్చిన అధికారులు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఎంతమంది ఉంటారనేదానిపై క్లారిటీ రానుంది. వైసీపీ వైదొలడంతో ఏకగ్రీవం అవుతుందనుకున్న కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఇండిపెండెంట్లు పోటీకి రావడం ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

జనవరి 12న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 16న కౌంటింగ్‌ జరిగి అదేరోజు ఫలితం వెలువడనుంది. పోటీలో లేని వైకాపాకు ఇప్పుడు ఎవరన్నా ఎమ్మెల్సీకి మద్దత్తు ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తుందట. గెలిచినా గెలవకపోయినా టీడీపీతో డబ్బు ఖర్చుపెట్టించాలని అనుకుంటుందట వైకాపా. ఓడిపోయినా ఆ ఓటమి తన ఖాతాలోకి చేరదు కాబట్టి వైకాపా ఇలా ఆలోచిస్తుందట.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Hyderabad’s 1.32 Lakh Stadium: Criminal Waste of Money?

Telangana is planning a massive new cricket stadium in Bharat Future City near Hyderabad. The…

30 minutes ago

Hyderabad Hit-And-Run: Anand Sai’s Son Sandeep Arrested

Art director and TTD Board Member Anand Sai’s son Sandeep has been arrested by Cyberabad…

40 minutes ago