Telugu

యానిమల్ నా మైండ్ కు సెట్ అయ్యే మూవీ కాదు…!

యానిమల్ మూవీ వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా అడపాదడపా ఆ మూవీ మీద ఎవరో ఒకరు నెగటివ్ కామెంట్స్ చేయడం పరిపాటుగా మారిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య నుండి వివాదాస్పద నటిగా పేరొందిన బాలీవుడ్ యాక్ట్రెస్ కంగనా వరకు యానిమల్ మూవీ పై ఆ మూవీ దర్శకుడు సందీప్ పై నెగటివ్ గా కామెంట్ చేసిన వారే.

అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో సీనియర్ నటి వచ్చి చేరారు. యానిమల్ మూవీ ని తానూ ఇంతవరకు చూడలేదని, ఇటువంటి సినిమాలు తన మైండ్ సెట్ కు సరిపోవని, ఇలాంటి మూవీలు ఎలా హిట్ అవుతున్నాయో తనకు అర్ధం కావడం లేదంటూ యానిమల్ మూవీ పై మరో కాంట్రావెర్సీ కామెంట్ చేసారు నటి కుష్బూ.

ADVERTISEMENT

యానిమల్ మూవీ లాంటి సినిమాలు విజయం సాధిస్తున్నాయి అంటే అసలు ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరూ మహిళల గౌరవం, సమానత్వం గురించి ప్రసంగాలు చేస్తారు…మళ్ళీ యానిమల్ మూవీ లాంటి సినిమాలను చూసి బాగుంది అంటూ సూపర్ హిట్ చేస్తారు. వారి మైండ్ లో ఏముందో అసలు అర్ధం కావడం లేదు అంటూ యానిమల్ మూవీ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కుష్బూ.

తన సినిమా పై చేస్తున్న ప్రతి విమర్శకు ఒక కౌంటర్ తో సమాధానం చెపుతున్న సందీప్ వంగా కుష్భు కి ఎటువంటి బదులిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వంగా అభిమానులు. ఒక సినిమా పై విడుదలైన నాటి నుంచి ఇంతకాలం పాటు ఏదోఒక వివాదం కొనసాగడం బహుశా యానిమల్ మూవీ తోనే మొదలేమో.

సందీప్ వంగా తీసిన రెండు సినిమాలు విజయదేవర కొండా అర్జున్ రెడ్డి కానీ, రణబీర్ కపూర్ యానిమల్ కానీ నాణానికి ‘బొమ్మా – బొరుసు’ లాగా ‘వివాదాలు – విజయాలు’ రెండిటిని అందిపుచ్చుకున్నాయి. సందీప్ మూవీస్ కు ప్రసంశలు – విమర్శలు , వసూళ్లు – అవార్డులు అన్ని సమపాళ్లలో రావడం విశేషం.

సినీ రంగానికి సంబందించిన సెలబ్రేటిస్ సైతం యానిమల్ మూవీ పైన ఇంతటి నెగటివ్ కామెంట్స్ చేస్తుంటే ఇక యానిమల్ కు సీక్వెల్ గా రానున్నయానిమల్ పార్క్ ఇంకెంత వివాదస్పదం కానుందో..? ఇప్పటికే యానిమల్ మూవీ చివరిలో యానిమల్ పార్క్ విధ్వంసం ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ శాంపిల్ చూపించారు వంగా.

ఇక సినిమా విడుదలైన తరువాత చాలామంది నోటికి యానిమల్ పార్క్ పనిచెప్పనుంది అనేది క్లారిటీ వచ్చేసింది అంటున్నారు సినీ అభిమానులు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

SDT19: Sai Durgha Tej, Teja Kakumanu and Anil Sunkara Join Hands

Sai Durgha Tej, filmmaker Teja Kakumanu and producer Anil Sunkara are joining hands for #SDT19.…

32 minutes ago

Is Bellamkonda Washing His Hands of Tyson Naidu?

Bellamkonda Sai Sreenivas finished shooting for Tyson Naidu a long time ago, but the film…

38 minutes ago