
జింబాబ్వేతో జరుగుతున్న అయిదు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న రెండవ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే కేవలం 155 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. సండకాన్ 4 వికెట్లు తీయగా, చివరి మూడు వికెట్లను లెగ్ బ్రేక్ బౌలర్ హసరంగా హ్యాట్రిక్ గా నమోదు చేసుకున్నాడు. 2.4 ఓవర్లు వేసిన హసరంగా 15 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లను సొంతం చేసుకున్నాడు.
ఇలా తొలి మ్యాచ్ లోనే హ్యాట్రిక్ సాధించిన బౌలర్ల జాబితాలో ఇంతకుముందు బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఉండగా, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబడ ఉన్నారు. ఈ జాబితాలో మూడవ బౌలర్ గా హసరంగా నిలిచాడు. అయితే అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్ గా కీర్తిని అందుకున్నాడు ఈ శ్రీలంక స్పిన్నర్. లక్ష్యం చిన్నదే కావడంతో దానిని శ్రీలంక అవలీలగా చేదిస్తోంది. రెండు మ్యాచ్ లు ముగిసే సమయానికి సిరీస్ 1-1తో సమంగా నిలిచింది.
The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…