
అయితే ఈ క్రమంలో ఎన్ఠీఆర్ కధా నాయకుడు ఫ్లాప్ కావడం, మరో పక్క ఎన్ఠీఆర్ మహా నాయకుడిపై అంచనాలు ఆర్జీవీ వల్ల సన్నగిల్లుతున్నాయి అని వార్తలు బలంగా వినిపిస్తునం తరుణంలో…మీడియా ఫోకస్ అంతా ఇప్పుడు ఆర్జీవీ సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ పై పడింది. అయితే ప్రేక్షకులు కూడా బాలయ్య ఎన్ఠీఆర్ లో పెద్దగా ఇంటరెస్టింగ్ కోణం ఏమి లేదు అని, పైగా అందరికీ తెలిసిన విషయాలనే తీశారు తప్ప, తెలియని వాటిని టచ్ చెయ్యలేదు అని, ఈ క్రమంలో ఆర్జీవీ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఏం చూపించనున్నాడో అని ఆసక్తిగా చూస్తున్నట్లు సమాచారం.
అయితే అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు, పాపం ఆర్జీవీ సినిమా అయితే బాగా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది కానీ, కాకపోతే ఆయన ట్రాక్ రికార్డు మాత్రం ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే ఆలోచన చేస్తుందో లేదో అన్న భయమే బయ్యర్స్ ను వెంటాడుతుంది. మరి చూద్దాం ఏం జరగబోతుందో.
Telangana's Tummidihatti project has triggered a fresh political confrontation between the Congress government and the…
Bhuvneshwar Kumar has struggled in his first two T20Is after returning to the Indian team…