Telugu

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను ఆపేసిన సెన్సార్ బోర్డు

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్‌ జీవితంలోని చివరి రోజుల గురించి లక్ష్మి పార్వతి దృక్కోణం నుండి దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తీసిన వివాదాస్పద సినిమా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఈ నెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఏపీలో ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడును దోషిగా చూపించే ఈ సినిమా విడుదల చేయడం సబబు కాదని తెదేపా కార్యకర్త దేవిబాబు చౌదరి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ADVERTISEMENT

దాంతో సినిమాను ప్రస్తుతానికి నిలిపివేయాలంటూ సెన్సార్‌బోర్డు చిత్రబృందాన్ని ఆదేశించింది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది. దీనితో ఈ సినిమా విడుదల ప్రస్తుతానికి ఆగిపోయినట్టే. దీనిపై తాజాగా ట్విటర్‌ ద్వారా వర్మ స్పందిస్తూ.. సెన్సార్‌ బోర్డుపై కేసు పెడతానని, సినిమా విడుదల కోసం న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. త్వరలో కడపలో ఓ బహిరంగ సభలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఆడియో వేడుకను నిర్వహించనున్నట్లు వర్మ శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు సినిమా వాయిదా పడటం వల్ల ఆ బహిరంగసభ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. దీనితో ఈ సినిమా మీద వివాదాలు మరింత ముదిరాయి. ఎన్నికల వల్లే ఈ సినిమా కు హైప్ వచ్చింది. ఎన్నికల తరువాత విడుదల అంటే సినిమాకు ఇబ్బంది అనే చెప్పుకోవాలి. ఎన్నికల కోడ్ వచ్చే వరకు విడుదల చెయ్యకుండా ఆలస్యం చేసినందుకు గానూ వారు ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Dhurandhar2 Overseas: Finally, SRK’s Records Shattered?

The overseas performance of Dhurandhar: The Revenge has become a major talking point. The film…

20 minutes ago

ప్రభుత్వాలు పరిమితులు, ప్రాధ్యానతలు మరిస్తే… సమ్మెలు!

అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా వాటికి ఆర్ధిక పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడే ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. విగ్రహాలు,…

25 minutes ago