
పాన్ ఇండియన్ సినిమాలు తీస్తున్నాం, వందల కోట్ల మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నాం, మన ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేస్తున్నాం. అయితే.. మనుషులుగా మాత్రం కనీస స్థాయి విలువలు కూడా పాటించలేకపోతున్నాం. ఇదీ ప్రస్తుతం తెలుగు చిత్రసీమ దుస్థితి.
కరోనా సమయంలో దిగ్గజ గాయకులు, నిర్మాత, సంగీత దర్శకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో మృతి చెందినప్పుడు తమిళ చిత్రసీమ లేదా తమిళనాడు ప్రభుత్వం చూపిన చొరవను మన తెలుగు చిత్రసీమ కానీ.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చూపించలేకపోయాయి.
ఎస్పీబీ మరణించి 5 ఏళ్లు గడుస్తున్నాయి. బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ ఇన్ సౌత్ అని చెప్పుకొనే టాలీవుడ్ ఇప్పటివరకు కనీసం మచ్చుకకైనా ఒక సంస్మరణ సభ నిర్వహించలేదు. ఆయన మరణించిన ఏడాదికి మాత్రం ఆన్ లైన్ లో టాలీవుడ్ అగ్రతారలు వీడియో కాల్స్ లో ఆయన గురించి మాట్లాడి మమ అనిపించారు.
ఇప్పుడు గానకోకిల జానకమ్మ పరిస్థితి కూడా ఇంతే. నిన్న ఆమె మరణించగానే పొలోమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బాధపడిపోయిన టాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒక్కరు కూడా మైసూరులోని ఆమె పార్థివ దేహాన్ని సందర్శించలేదు.
కర్ణాటక ప్రభుత్వం ఆమెకు స్టేట్ హానర్ ను కల్పించినప్పటికీ.. తెలుగు నేలపై పుట్టి, తెలుగులో 12 నంది అవార్డులు ఉత్తమ గాయనిగా అందుకున్న జానకమ్మను మన తెలుగువారెవరూ కనీసం పట్టించుకోకపోవడం అనేది బాధాకరం.
లెజండరీ బాలు కోసమే సంస్మరణ సభ ఏర్పాటు చేయని తెలుగు సినిమా పెద్దలు.. జానకమ్మను తలుచుకుంటూ అలాంటి సభను ఏర్పాటు చేస్తారు అనుకోవడం కూడా అత్యాశే.
Story, Screenplay, Director: P.S Mithran Cast: Karthi, SJ Suryah, Malavika Mohanan, Ashika Ranganath, Yogi Babu,…
October marks the beginning of the US federal fiscal year. The reset may restore the…