
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు ఈ మూడు పదాలు ఆంధ్రప్రదేశ్ లో విని దాదాపు ఐదేళ్లు పూర్తియిందేమో..! వైసీపీ హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు అంటే ప్రభుత్వం నడిపే మద్యం దుకాణాలు, ఫిష్, మటన్ షాపులని, ఉద్యోగాలు అంటే వాలంటీర్లనే భ్రమలో ఉంచారు.
అయితే కూటమి రాకతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పై ఇక్కడ యువత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలకు, ఆశయాలకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం గత వైసీపీ విధ్వంశం నుండి ఏపీ పారిశ్రామికంగా కోలుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తుంది.
ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ మంత్రిగా నారా లోకేష్ కూడా పాలనలో, ప్రభుత్వంలో తనదైన మార్క్ చూపించడానికి వందకు వంద శాతం కృషి చేస్తున్నారు. బాబు మీద ఉన్న నమ్మకం, లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఏపీకి తిరిగి పరిశ్రమలను తీసుకొస్తున్నాయి. గత టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ నిర్మాణంతో ఏపీ పారిశ్రామిక ప్రగతికి పునాదులు వేశారు నాటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఇప్పుడు అదే శ్రీసిటీ లో మరో పరిశ్రమ కొలువుతీరడానికి సిద్దమయ్యింది. ‘LG ఎలక్ట్రానిక్స్’ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు LG కంపెనీ ముందుకొచ్చింది. నేడు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శ్రీ సిటీలో ఈ సంస్థ భూమి పూజ నిర్వహించింది.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ LG ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ ప్రారంభమైతే మన దేశానికి అవసరమయ్యే ఏసీ లలో 70 % ఇక్కడ నుంచే సప్లై అవుతాయి, శ్రీ సిటీలో ఈ సంస్థ సుమారు 5 వేల కోట్ల పెట్టుబడితో ఏపీ పారిశ్రామిక ప్రగతికి తోడ్పడుతుంది. అలాగే దీని ద్వారా 2 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయంటూ వ్యాఖ్యానించారు.
అలాగే ఇది కేవలం ఒక పరిశ్రమకు వేసే పునాదులు కాదు ఏపీ పారిశ్రామిక ప్రగతికి వేసే పునాదులుగా భావించాలి అంటూ లోకేష్ LG సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మరో 839 కోట్లతో ఈ సంస్థకు సంబంధించిన 5 అనుబంధ యూనిట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
అయితే నేడు శ్రీసిటీలో భూమి పూజ నిర్వహించిన LG ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు పై స్పందించిన ముఖ్యమంత్రి బాబు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ కింద ఈ ప్రాజెక్ట్ కు వంద శాతం ప్రోత్సహకాలు అందించినట్టు ట్వీట్ చేసారు. అలాగే ఈ యూనిట్ ఏర్పాటు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి కొత్త అధ్యాయమంటూ పేర్కొన్నారు.
రానున్న నాలుగేళ్ళ కాలంలో ఏపీకి మరిన్ని పరిశ్రమలు తెచ్చి ఇక్కడి యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తున్న లోకేష్ తన లక్ష్యాన్ని చేరుకోవాలని, ఏపీ పారిశ్రామిక ప్రగతికి తనవంతు కృషి చేయాలంటూ ఇక్కడి నిరుద్యోగ యువత కోరుకుంటున్నారు.
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…