Telugu

ఓటీటీలో ‘లైగర్’.. రౌడీ స్టార్‌పై ట్రోల్స్ త‌ప్ప‌వా!

విజ‌య్ దేవ‌రకొండ ఇండియాని షేక్ చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా లైగ‌ర్‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో విడుద‌లైంది. ఆగ్ లగా దేంగే.. ఇండియాను షేక్ చేసేస్తామంటూ డైలాగులు చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు.. లైగ‌ర్ సినిమా మాత్రం తిరుగులేని షాక్ ఇచ్చింది. డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. సినిమా పోతే పోయింది. కానీ సినిమాను, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను, పూరి జ‌గ‌న్నాథ్‌ను నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. ఈ సినిమా ఎఫెక్ట్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు మీడియా ముందుకు రావ‌టానికి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌టం లేదు. ఇక పూరి జ‌గ‌న్నాథ్ అయితే సైలెంట్ అయిపోయాడు.

ఇప్పుడంతా మ‌ర‌చిపోయారనుకునే స‌మ‌యానికి మ‌ళ్లీ లైగ‌ర్ డిజాస్ట‌ర్‌ను గుర్తు చేయబోతున్నారు ఓటీటీ ద్వారా. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు సెప్టెంబ‌ర్ 22న ప్ర‌ముఖ ఓటీటీ ఛానెల్ డిస్నీ హాట్ స్టార్‌లో లైగ‌ర్ ప్రసారం కానుంది. దీంతో ట్రోల‌ర్స్‌కు మ‌ళ్లీ లైగ‌ర్‌పై కామెంట్స్ చేసే అవ‌కాశం ఇచ్చిన‌ట్టే.

ADVERTISEMENT

నిజానికి సినిమా థియేట‌ర్స్‌లో వ‌చ్చిన సినిమాల రిపోర్ట్‌కు.. ఓటీటీలో అదే సినిమా వ‌చ్చిన‌ప్పుడు వ‌స్తున్న రెస్పాన్స్‌కు టాక్ తేడా ఉంటుంది. ఏదో కొన్ని సినిమాల విష‌యంలోనే రెస్పాన్స్ ఒకేలా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఆచార్య వంటి సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌లైన‌ప్పుడు వ‌చ్చిన టాక్‌కి.. ఓటీటీలో వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చిన టాక్ ఒకేలా ఉంది. సినిమా ఓటీటీలో వ‌చ్చిన‌ప్పుడు ఇంకా ట్రోలింగ్స్ ఎక్కువ‌య్యాయి. ఇప్పుడు ఇక లై గర్ వంతు, ఒకసారి OTT లో ఇలాంటి మూవీ స్టార్ట్ అవగానే ఇలాంటి మూవీస్ ని సోషల్ మీడియా బ్యాచ్ చీల్చి వదుల్తారు. విజయ్ కానీ, లై గర్ టీం కానీ సోషల్ మీడియా కి దూరంగా ఉండటమే మంచిదేమో!

అయితే కొన్ని సినిమాల విష‌యంలో థియేట‌ర్ టాక్ విష‌యంలో.. ఓటీటీ రిలీజ్ అయిన‌ప్పుడు వ‌చ్చిన టాక్ విష‌యంలో తేడా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు అంటే సుంద‌రానికీ సినిమా థియేట‌ర్స్‌లో వ‌చ్చిన‌ప్పుడు బాగోలేద‌నే అన్నారు. అయితే అదే సినిమాకు ఓటీటీలో ఒక సెక్షన్ ఆడియెన్స్ కి విపరీతంగా నచ్చేసింది. అంటే సినిమా మ‌రీ ఘోరంగా ఉంటే త‌ప్ప‌.. ఓకే అనుకునే సినిమాల‌కు ఓటీటీలో రెస్పాన్స్ మారుతుంది. కానీ లైగ‌ర్ సినిమా విషయంలో మాత్రం అలా ఉండ‌ద‌ని.. ట్రోలింగ్‌కు తప్పకపోవచ్చు!

Exclusive Video Interviews: Watch & Subscribe

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

పుంగనూరులో అంత హడావుడి చేసి ఇప్పుడు తూచ్ అంటే ఎలా?

ఇటీవల పుంగనూరులో నామినేషన్స్‌ ప్రక్రియలో వైసీపీ ఎమ్మెల్సీ మిథున్ రెడ్డి ఎంత హడావుడి చేశారో, ఎంత విధ్వంసం జరిగిందో అందరూ…

5 minutes ago

KWK9: Rashmika Proposed 100 Times? Vijay Drops a Bomb!

Vijay Deverakonda and Rashmika Mandanna are currently promoting their latest film Ranabaali. The popular pair…

29 minutes ago