
YSRCP Withdraws From Punganur Elections
ఇటీవల పుంగనూరులో నామినేషన్స్ ప్రక్రియలో వైసీపీ ఎమ్మెల్సీ మిథున్ రెడ్డి ఎంత హడావుడి చేశారో, ఎంత విధ్వంసం జరిగిందో అందరూ కళ్ళారా చూశారు. అయితే అక్కడ ఆయనపై టీడీపి శ్రేణులు హత్యాప్రయత్నం చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకొని వచ్చారంటూ వైసీపీలో రోజా వంటి నేతలు ఆయనకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపినట్లు సొంత మీడియాలో వార్తలు వేసుకొని ఆ కథను రక్తి కట్టించింది.
నాడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనకు వెళ్తే వైసీపీ శ్రేణులు పార్టీ జెండాలు తగిలించిన కర్రలు పట్టుకొని చేసిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా దాని దూకుడు ఏమాత్రం తగ్గలేదని ఎంపీ మిథున్ రెడ్డి వాహనంతో టీడీపి శ్రేణులను పోలీసుల ఎదుటే ఢీ కొట్టించి నిరూపించుకున్నారు.
కనుక వైసీపీ మూకలను చూసి టీడీపి శ్రేణులు భయపడే పరిస్థితి నెలకొంది. కనుక నామినేషన్స్ వేసేందుకు వారు భయపడాలి. కానీ ఇంత హడావుడి చేసిన తర్వాత పుంగనూరు ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కూటమి ప్రభుత్వం దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ, ఎవరినీ నామినేషన్స్ వేయకుండా అడ్డుకుంటునందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రకటించారు.
ఇంట్లో మొగుడ్ని చితకబాదినమ్మ ఊర్లో పంచాయితీ పెట్టినట్లు, టీడీపి శ్రేణులు ఆస్పత్రి పాలయ్యేలా గాయపరిచిన తర్వాత, ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకుంటునట్లు ప్రకటించడం రాజకీయ లౌక్యం తప్ప మరొకటి కాదు.
ఏదో విధంగా ఈ ఎన్నికలు ఆపాలని విశ్వప్రయత్నాలు చేసిన వైసీపీ, ఇప్పుడు రాయచూరు, పుంగనూరు ఘటనలను సాకుగా చూపుతూ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరగడం లేదనే ఈసీకి పిర్యాదు చేసింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు లేదా ఈ ఓటమి నుంచి తప్పించుకునేందుకు ఈ సాకు చెపుతున్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి అతి తెలివితేటలే 2024 శాసనసభ ఎన్నికలలో వైసీపీ కొంప ముంచాయి కదా?
Vijay Deverakonda and Rashmika Mandanna are currently promoting their latest film Ranabaali. The popular pair…
In the Bigg Boss TV reality show, every season, someone gets a lot of push.…