
గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు 1.22 కోట్లు సాధించగా, రెండవ రోజు 2.17 కోట్లు, ఆదివారం నాడు 2.41 కోట్లు అందుకుని వీకెండ్ ను ముగించింది. సినిమా హిట్టో, ఫట్టో తెలుసుకోవడానికి కొలమానంగా మారిన మండే టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది. మొదటి రోజు (1.22 కోట్లు) సాధించిన దాని కంటే సోమవారం నాడు 1.28 కోట్లు వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద విజయపు జెండా ఎగురవేసింది. దానికి మించిన మరో విశేషం ఏమిటంటే… మండేను మించిన స్థాయిలో మంగళవారం నాడు 1.36 కోట్లు సాధించడం..!
మొత్తమ్మీద తొలి అయిదు రోజులకు 8.44 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద “లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా” పెద్ద విజయాన్ని అందుకుంది. మహిళల చుట్టూ తిరిగే కధంశాలకు బాలీవుడ్ ప్రేక్షకులు ఇస్తోన్న విశేష ఆదరణకు మరో నిదర్శనం ఇది. గతంలో రాధిక ఆప్టే న్యూడ్ గా నటించిన “పార్చేడ్” సినిమాను కూడా బాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనం పలికిన విషయం తెలిసిందే. బహుశా మున్ముందు ఈ తరహా సినిమాలు ఎక్కువగా నిర్మాణం అవుతాయని చెప్పడంలో సందేహం లేదు.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…