
హీరో హీరోయిన్లు లవ్ లో పడడం… విలన్లు అడ్డుకోవడం… హీరో ఫైటింగ్‌లు… విలన్ చేజింగ్‌లు…. మధ్య మధ్యలో పాటలు… ఇలా అంతా రొటీన్ కమర్షియల్ ఫార్ములాలోనే ఉంది. అయితే ఎంత రొటీన్ గా ఉన్నా, ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఉంటే అది ప్రేక్షకులను మెప్పిస్తుంది, కానీ 100 సెకన్ల నిడివి గల ఈ ‘లవర్’ ట్రైలర్ లో మచ్చుకైనా వినోదం పండకపోవడం కొసమెరుపు.
ఈ ట్రైలర్ చూసిన తర్వాత దిల్ రాజు ఇంత ఫక్తు కమర్షియల్ బొమ్మను రాజ్ తరుణ్ హీరోగా నిర్మించారా? అంటే నమ్మశక్యం కాదు. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కనపడుతున్నాయి గానీ, కంటెంట్ పరంగా రాజు గారి మార్క్ ను మాత్రం చూపించలేకపోయింది. అన్నిష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆరు సంగీత దర్శకుడు సంగీతం అందించడం విశేషం.
Varsha Rekhate is turning a sunlit tropical escape into her personal fashion runway. A punchy…
Fahadh Faasil's debut Telugu film as a lead actor, Don't Trouble the Trouble directed by…