Telugu

గ్యాస్ కి ఆల్టర్నేటివ్ ఇండక్షన్…

ఇరాన్, ఇజ్రయిల్, అమెరికా మధ్య సాగుతున్న యుద్ధ ప్రభావంతో ప్రపంచం మొత్తం ఇంధన కొరత తో బాధపడుతుంది. అయితే జనాభా అధికంగా ఉండే భారతదేశంలో ఈ కొరత పానిక్ గా మారుతుంది. తమకు ఈ ఇంధన సమస్య రాకూడదు అనే పానిక్ తో కొందరు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ ని భద్రతా పరుచుకుంటున్నారు.

ఇక అలాగే ఈ యుద్ధ ప్రభావం భారతదేశ వంటగదిని కూడా తాకడంతో వంటకు వాడుకునే LPG విషయంలో కూడా సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు ఎంతలా భయపడాల్సిన అవసరం లేదని వారిస్తున్నా, ప్రజలు మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ADVERTISEMENT

ఈ పానిక్ పరిస్థితులలో దేశంలో LPG ల కొరత పెరుగుతుంది. చాలావరకు LPG బుకింగ్స్ పానిక్ ల వల్లే జరుగుతున్నాయని, దాని ఫలితంగా ఈ గ్యాస్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వాలు చెపుతున్నాయి.

దీనితో ఇటు కేంద్ర ప్రభుత్వాలతో పాటుగా అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాలలో ఈ LPG సమస్యల పై ఆరా తీస్తున్నారు, సమస్యలు ఏర్పడకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు. నేడు ఏపీ సీఎం బాబు సైతం అధికారులతో ఈ సమస్య పై సమీక్ష నిర్వహించారు.

అలాగే ఇటు ప్రజలకు సైతం వంటకు LPG కు బదులుగా ఇండక్షన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇండక్షన్ మీద అవగాహన ఉన్న వారు, వసతి ఉన్న వారు గ్యాస్ స్థానంలో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వంట ప్రక్రియలు పూర్తి చేసుకోవాలని, అలా చేస్తే కొంతవరకైనా ఈ గ్యాస్ ఆదా చేసినవారవుతారని సూచనలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తాము వాడే వంటకు ఎటువంటి వాటిని వాడుకోవాలి అని సూచనలు చేయడం ఇదే తొలిసారి అని ఇటువంటి అనుకోని విపత్తులు, సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రజలు కూడా పెద్ద మనసుతో ప్రభుత్వాలకు సహకరిస్తూ తమవంతు బాధ్యతగా మెలిగితే ఇంధన సరఫరా పై కానీ గ్యాస్ పంపిపిణీల పై కానీ ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు అంటున్నారు పరిశీలకులు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఈ తాతయ్య ఎప్పుడూ ఇంతే… ఇంకా మనుమలు కావాలంటాడు!

తల్లి తండ్రులు తమ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని మనుమలని అందించాలని కోరుకుంటారు. కుదిరితే మునిమనుమలని కూడా చూసి వెళ్ళాలనుకుంటారు. కానీ…

10 minutes ago

The “KGF to JGF” Flip: Kurnool is Rewriting India’s Mining History

At the AMCA defense foundation ceremony on Friday, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu dropped…

16 minutes ago