
మహేష్ – త్రివిక్రమ్ కాంభినేషన్ లో ‘హరే రామ హరే కృష్ణ’ టైటిల్ తో చేసిన ప్రకటన పేపర్ కే పరిమితం అయ్యింది. అలాగే మరో వైపు ‘పౌర్ణమి, వాన’ వంటి సినిమాను పరాజయం పాలు కావడం, ఇదే సమయంలో తన కొడుకును హీరోగా పరిచయం చేయాలనుకోవడం పెద్ద సినిమాల నిర్మాతగా రాజు గారి పేరును వెనక్కి నెట్టింది. అయినప్పటికీ, త్రిష, హన్సిక వంటి నలుగురు టాప్ హీరోయిన్లతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటించి, కొంత షూటింగ్ కూడా చేసినా, అది ఏమైందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తానని అన్న రాజు గారి మాటలు కార్యరూపం దాల్చలేదు.
అయితే, తాజాగా ఆరు భాషల్లో ఓ సినిమాను నిర్మించనున్నానని చేసిన ప్రకటన టాలీవుడ్ లో క్రేజీగా మారింది. ఒకప్పుడు వెంకటేష్, మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించిన ఎం.ఎస్.రాజు ప్రస్తుతం “రతి” అనే ఓ శృంగారభరితమైన చిత్రాన్ని ఎంపిక చేసుకోవడం అనేది ప్రేక్షకులు జీర్ణించుకోలేని విషయమని చెప్పవచ్చు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషలలో నిర్మించబోతున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఈ జోనర్ లో తానూ ఈ “రతి” అనే సినిమాను తెరకెక్కించనుండడం పట్ల ఎంఎస్ రాజు మిక్కిలి సంతోషం వ్యక్తం చేసారు.
మరి ఈ సినిమా అయినా విడుదలకు నోచుకుంటుందో లేదో గానీ ఎంఎస్ రాజు గారు పునర్వైభవం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…
Nora Fatehi turns a hotel-room backdrop into her own fashion runway, bringing fearless glamour to…