Telugu

సభ్య సమాజానికి ఏం సందేశాన్నిస్తున్నారు?

ఓ నిరుపేద వైసీపీ ముఖ్యమంత్రి… ఈవీఎంలను పగలకొట్టి మహిళలను బెదిరించే ఓ సౌమ్యమైన వైసీపీ ఎమ్మెల్యే… ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేదికగా గడిచిన అయిదేళ్ల అనుభవాలు ఎన్నో ఎన్నెన్నో…!

అయితే ప్రజల తీర్పు ఈవీఎంలలో భద్రపరిచిన వేళ, వాటిని కూడా ఏమార్చడానికి ఏ మాత్రం వైసీపీ వెనుకడుగు వేయదన్న విషయాన్ని గడిచిన 24 గంటలుగా వైరల్ అవుతోన్న వీడియోనే చెప్తుంది.

ADVERTISEMENT

తమ ఎమ్మెల్యే ఏ తప్పు చేయకపోతే మీడియా ముఖంగా బయటకు వచ్చి, తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని, సభ్య సమాజానికి మంచి సందేశం ఇవ్వవచ్చు కదా..! ఇలా పోలీసులను తప్పించుకుని తిరగడమేలా..!

అసలే నిరుపేద ముఖ్యమంత్రి గంటకు 15 లక్షలు మాత్రమే అద్దె ఉన్న ఓ విలాసవంతమైన సామాన్య విమానంలో ప్రయాణించి, ఇప్పటికే సమాజానికి ఉపదేశాన్ని భోధించగా, వారి ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో పయనిస్తున్నారని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

నిన్న ఈవీఎంలను పగులగొట్టిన వీడియో విడుదల కాగా, నేడు మహిళలను బెదిరించే విధంగా ఉన్న వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో, సౌమ్యమైన వైసీపీ ఎమ్మెల్యే విధానం విడతల వారీగా బయటకు వస్తోంది.

టీడీపీ, జనసేనల ద్వారా రిలీజ్ అయిన ఈ వైరల్ వీడియోలను వీక్షించిన ఈసీ అధికారులు పోలీసుల ద్వారా తక్షణమే చర్యలకు శ్రీకారం చుట్టారు గానీ, అసలు గమనించాల్సిన అంశమేమిటంటే… అల్లర్లు జరిగేటటువంటి ప్రాంతాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహించి, ఇలాంటి సౌమ్యమైన వైసీపీ ఎమ్మెల్యే తీరును చూస్తూ ఉండిపోయిన అధికారులు ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నారో?

తెలంగాణాలో దాగి ఉన్న ఈ వైసీపీ పులి అరెస్ట్ అంటూ, అలాగే చివరి నిముషంలో తప్పించుకున్నారంటూ మీడియా కధనాలు వినపడుతున్నాయి గానీ, పోలీసు అధికారులు మాత్రం దేనిని ఇప్పటివరకు ధ్రువీకరించలేదు.

ఇంతకీ ఈ వీడియోలపై కాసు మహేష్ రెడ్డి వంటి మరో సౌమ్యమైన వైసీపీ ఎమ్మెల్యే ఇస్తోన్న వివరణ ఏమిటంటే… ఆ బూత్ లో టీడీపీ రిగ్గింగ్ చేసిందట, అందుకే సదరు సౌమ్యమైన, డబ్బులు అంతంత మాత్రమే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఆ విధంగా ఈవీఎంలను పగలగొట్టారంట!

చేస్తే గీస్తే తామే రిగ్గింగ్ చేయాలనే సందేశాన్ని పంపిస్తున్నారా..? నిజంగానే రిగ్గింగ్ జరిగి ఉంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న వీడియోలను వైసీపీ బయటపెట్టి సభ్య సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వవచ్చు కదా..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Finally, Pressure Starting On Jagan And Co?

YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…

11 minutes ago

Forget Reels, Focus on Real Life: Suriya

Actor Suriya has a message for students who spend too much time making reels, focus…

41 minutes ago