
ఆమె సోదరుడు సితారా నాగవంశీ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వస్తుంది ఈ చిత్రం.
అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే… నిత్యం బూతులో తేలియాడే వ్యక్తులు కూడా నీతి సూత్రాలు చెబుతున్నారు. అడల్ట్ కామెడీ సినిమాలు అసలు ప్రపంచంలో ఎక్కడా రానట్టు, అవి తీసే వాళ్లకు క్యారెక్టర్ లేనట్టు ఉపోద్ఘాతాలు చెబుతున్నారు.
సరే ఇలా మాట్లాడే వాళ్ళు ఉండటం మాములే. ఇందులో కొందరు కొత్త అవతారమెత్తారు. మరి ఎవరి మీద అక్కస్సో తెలీదు గానీ కొత్త నిర్మాత హారిక ను టార్గెట్ చేశారు. దిల్ రాజు కూతురు హన్షిత బలగం లాంటి మంచి సినిమాతో లాంచ్ అయ్యారు. చినబాబు కుమార్తె ఇటువంటి సినిమాతో వచ్చారు అంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు.
సరే ఒక సినిమా గానీ సినిమా టీజర్ గానీ నచ్చకపోవడం అనేది వేరు వేరు విషయాలు. తీసే సినిమాలను ఏదో ఆయా ప్రొడ్యూసర్ల క్యారెక్టర్లకు ఆపాదించే భావదారిద్రయం ఏంటో?
దిల్ రాజు కుమార్తె బలగం లాంటి సినిమాలే చెయ్యరు కదా? ఇప్పటికే ప్రకటించిన రెండో సినిమా కమర్షియల్ జోనర్. మంచి కథ అనుకుంటే ఆమె అడల్ట్ కామెడీ తీయొచ్చు. తీసినా తప్పు లేదు.
దిల్ రాజు లాంటి సకుటుంబ సపరివార చిత్రాలు తీసే నిర్మాత దద్దరిల్లి పోయే ఐటెం సాంగ్స్ చెయ్యలేదా?
గొప్ప గొప్ప రైటర్లయిన వేటూరి వంటి వారు బూతుని ఎప్పుడూ వాడలేదా?
ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన ఒక కొత్త నిర్మాత అందులోనూ మహిళా నిర్మాతకు…తీసే సినిమాల బట్టి… క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడం దౌర్బాగ్యం.
ఇండస్ట్రీలో బూతు అనేది మొదలయ్యింది ఈ సినిమా తోనేనా అంటే కాదు. పోనీ నీకు నచ్చకపోతే ఆ సినిమా లో నటించిన వాళ్ళనో, తీసిన డైరెక్టర్ మీదనో అనుకో… ఇంకా కావాలంటే ఆ ప్రాజెక్ట్ లోనే త్రివిక్రమ్, నాగవంశీ ఉండనే ఉన్నారు. అయితే ఇప్పుడే వచ్చిన కొత్త మహిళా నిర్మాత క్యారెక్టర్ ని తప్పుపడుతున్నట్టు గా ఇండైరెక్ట్ రాతలు రాయడం హేయం.
సోషల్ మీడియాలో, మీడియాలో ఇటువంటి కూతలు కూసే వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు, వాళ్ళు రాసే వార్తలతో వారి క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తే ఒప్పుకుంటారా?
Elon Musk has become the first person in history to reach a trillion-dollar net worth,…
The Ramayana teaser has given audiences an idea of the scale Namit Malhotra is planning…