
మళయాలం రీమేక్ ‘ప్రేమమ్’ సినిమాలో నటించిన మడోన్నా సెబాస్టియన్… తన ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయిందని పేర్కొంది. తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పిన మడోన్నా తాను మళ్లీ ప్రకటించే వరకు తన ఫేస్ బుక్ పేజ్ నుంచి వచ్చే పోస్టులు లేదా ఫోటోలను పట్టించుకోవద్దని అభిమానులకు సూచించింది. ఇది ఇబ్బంది కలిగించే పరిణామమే అయినా తప్పదని పేర్కొంది. దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
అయితే అదృష్టవశాత్తు సుచిత్ర ట్విట్టర్ ఎకౌంటు మాదిరి, ఈ ఫేస్ బుక్ అకౌంట్ లో ఎలాంటి సంచలన విషయాలు వెల్లడించకపోవడం విశేషం. అయితే తన ఎకౌంటు హ్యాక్ అయ్యి ఉండి కూడా, తను ఎలా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిందో అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఎవరిదైనా అకౌంట్ హ్యాక్ అయితే, సదరు అకౌంట్ కు సంబంధించిన హక్కులన్నీ వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. కానీ, సెబాస్టియన్ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరగడం విశేషం.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…