
అయితే ఈ సినిమాను నిర్మించే సంస్థ విషయంలోనే ఇప్పుడు తర్జనభర్జనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో మహేష్ కు బాగా సన్నిహితంగా మారిన ‘14 రీల్స్ – మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థల మధ్య ఈ ప్రతిష్టాత్మక సినిమా కోసం తీవ్ర పోటీ నెలకొందని సినీ వర్గాల టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డేట్స్ మైత్రీ మూవీ మేకర్స్ వద్ద ఉండడంతో ముందుగా ఈ సినిమాను నిర్మించే అవకాశం వీరికే దక్కుతుందని భావించారు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా త్వరలోనే మహేష్ తో మరో సినిమాను నిర్మించబోతున్నామని ఇప్పటికే ఓ ప్రకటన చేసింది. దీంతో ప్రిన్స్ 25వ సినిమా ‘శ్రీమంతుడు’ బ్యానర్ లోనే అని అభిమానులు గట్టిగా ఫిక్స్ అయ్యారు.
అయితే అనూహ్యంగా 14 రీల్స్ సంస్థ బరిలో నిలిచింది. తాజాగా ఈ సంస్థ చేసిన ప్రతిపాదనలు వర్కౌట్ అయ్యేలా ఉన్నాయని, మహేష్ కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో త్రివిక్రమ్ సైడ్ నుండి మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ సైడ్ నుండి 14 రీల్స్ పోటీ పడుతున్న తరుణంలో… చివరికి ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. గత అనుభవాల దృష్ట్యా… ప్రిన్స్ అభిమానులు మాత్రం త్రివిక్రమ్ సైడ్ నిర్మాతలకే ఓటు వేస్తున్నారు. అది ఇది కాకపోతే… చివరి క్షణంలో ఏకంగా డైరెక్టర్ మారిపోతారేమో చూడాలి..?!
Chandrababu Naidu is changing how Andhra Pradesh works. He is focusing on saving government money…
In under three weeks from now, Ram Charan will be returning to the big screen…