
దీంతో జూన్ 23వ తేదీన ప్రిన్స్ ఆగమనానికి ముందుగానే లైన్ క్లియర్ అయ్యింది. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేస్తుండడంతో మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో, దీనికి పోటీగా తమిళ ఇండస్ట్రీ నుండి పెద్ద సినిమాలేవి బరిలో నిలిచే అవకాశం లేదు. కానీ, బాలీవుడ్ నుండి మాత్రం తాజాగా సల్మాన్ ఖాన్ సినిమా ఎంట్రీ ఇవ్వడంతో ప్రిన్స్ కు భారీ షాక్ తగిలినట్లయ్యింది.
కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న “ట్యూబ్ లైట్” సినిమా విడుదల తేదీని జూన్ 23గా అధికారికంగా ప్రకటించారు. సల్మాన్ కున్న మార్కెట్ కు అదే రోజున ప్రిన్స్ మూవీకి ధియేటర్లు దొరకాలంటే కష్టసాధ్యమే. అందులోనూ బాలీవుడ్ లో కూడా విడుదలవుతున్న తొలి సినిమా కావడంతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ప్రిన్స్ భావించారు. కానీ ఆ ఆశలపై సల్మాన్ నీళ్ళు జల్లారు. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న సల్మాన్ ను డీ కొట్టడం ఇతర ఖాన్ ల వల్లే కాలేదు, మరి ప్రిన్స్ ఎంతవరకు పోటీ ఇస్తారో చూడాలి.
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…
Well, the inevitable has happened as the Telangana government under the leadership of Chief minister…