
మరో రెండు వారాల్లో టైటిల్, ఫస్ట్ లుక్, డిజిటల్ పోస్టర్ విడుదల అవుతాయని, ప్రస్తుతం చిత్ర యూనిట్ హెక్టిక్ షెడ్యూల్స్ తో బిజీగా ఉందని, మార్చి 11వ తేదీ నుండి చెన్నై షెడ్యూల్ ప్రారంభం కానుందని, అలాగే మార్చి 22 నుండి వియత్నాం వెళ్లనున్నారని రాజు గారు స్పష్టం చేసారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో తాజాగా “స్పైడర్” పేరు తెరపైకి వచ్చింది. ఫైనల్ గా ఏ పేరును ఖరారు చేస్తారో గానీ, ప్రిన్స్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు సంబంధించి బోలెడన్ని టైటిల్స్ వినపడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడియోకు సంబంధించి కూడా ఓ ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. సినిమాలో మొత్తం 5 పాటలు మాత్రమే ఉన్నాయని, అందులో ఒకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కాగా, మరో మూడు పాటలు హీరో హీరోయిన్లపై చిత్రీకరించేవని, ఒక పాట మాత్రం థీమ్ సాంగ్ అన్న సమాచారం బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఒక్క పాట మాత్రమే చిత్రీకరణ జరుపుకోగా, హీరో హీరోయిన్లపై వచ్చే డ్యూయెట్ సాంగ్స్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో షూట్ చేస్తారని తెలుస్తోంది.
Ranveer Singh is reportedly preparing for another ambitious project after the success of Dhurandhar. According…
A woman attending a US visa interview recently received a rare B2 visa approval despite…