
అయితే ఇది నిజంగా కార్యరూపం సిద్ధిస్తుందా? అంటే… అబ్బో… తెలుగు సినీ ప్రేక్షకులు ఇలాంటి కబుర్లు ఎన్ని విన్నారో అని చెప్పకతప్పదు. ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత అది హిట్టయినా, ఫట్టయినా… సినీ ప్రేక్షకులలోకి పాజిటివ్ సంకేతాలను తీసుకువెళ్ళడానికి… మళ్ళీ సదరు కాంబోలో మరో సినిమా రాబోతోందన్న ప్రచారం, ట్రేడ్ వర్గాలలో ఎప్పుడూ జరిగేదే. ఇందుకు ‘స్పైడర్’ ద్వయం కూడా మినహాయింపు కాదు.
అభిమానులను, సినీ ప్రేక్షకులను మరింత ఉత్సాహపరిచే క్రమంలో ఇలాంటి డైలాగ్స్ సాధారణంగా వస్తుంటాయి. అందులో భాగంగా మురుగదాస్ స్వయంగా చెప్పిన మాటలే గానీ, ఇవన్నీ కార్యరూపం దాల్చే అవకాశాలు అస్సలు లేవు. కాకపోతే మురుగా చెప్పిన దాంట్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… తమిళంలో విజయ్ హీరోగా, మహేష్ బాబు విలన్ గా మరియు తెలుగులో మహేష్ హీరోగా, విజయ్ విలన్ గా ఈ సినిమాకు రూపకల్పన చేసారని!
ఇదంతా జరుగుతుందో, లేదో పక్కన పెడితే… ఈ మాటలన్నీ “స్పైడర్” సినిమా విడుదలకు ముందు చెప్పినవి. అవును… తమిళంలో ‘స్పైడర్’ ప్రమోషన్ కార్యక్రమాలు జరిగినపుడు, అందులో భాగంగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన కార్యక్రమంలో మురుగదాస్ చెప్పినవి. అయితే ఆ తర్వాత ‘స్పైడర్’ విడుదల కావడం, సినీ ప్రేక్షకుల అంచనాలు తలక్రిందులు చేయడం వంటివి జరగడంతో… ప్రిన్స్ కూడా ఖచ్చితంగా పునరాలోచనలో పడి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు.
Anaira Gupta is raising temperatures with her sensational new style statement, effortlessly blending relaxed bohemian…
The ongoing year has brought a few surprises in terms of box office numbers and…