
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో మహేష్ ‘సిఎం’గా నటించబోతున్నారని, ఈ సినిమాను ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా కొరటాల మలిచారని హల్చల్ చేస్తున్న ఈ వార్తలో నిజం ఎంతుందనేది కొరటాల, మహేష్ లకే తెలియాలి. రాజకీయ అంశాలతో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో, కొరటాల మార్క్ బ్యాక్ గ్రౌండ్ సోషల్ మెస్సేజ్ తో ఈ సినిమా సిద్ధమవుతోందని టాక్. అయితే దీనిపై స్పష్టమైన సమాచారం వచ్చే వరకు ప్రిన్స్ ఫ్యాన్స్ కు నిద్ర ఉండదని చెప్పడంలో సందేహం లేదు.
‘దూకుడు’ సినిమాలో ఎమ్మెల్యేగా నాటకం ఆడిన మహేష్ లుక్ కు అభిమానులు ఏ విధంగా పట్టం కట్టారో తెలిసిందే. మరి అలాంటిది ఏకంగా ఒక ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ నిజంగా కనపడితే… సిల్వర్ స్క్రీన్ ఏమైపోవాలి? అందులోనూ సిఎం పాత్రలో ఇప్పటితరం నటులే కాదు, చిరంజీవి తరం హీరోలలో ఒక్కరు కూడా నటించలేదు. దీంతో ఈ సమాచారంపై అసలు వాస్తవాలు ఏంటని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. చూడాలి… చివరికి ఎలాంటి సమాధానం బయటకు వస్తుందో..?!
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…