Telugu

పొలిటిక్స్ లోకి ప్రిన్స్ ఎంట్రీ ఖరారైంది!

‘తనకు ఎమ్మెల్యే అంటే ఎవరో, ఎంపీ అంటే ఎవరో తెలియదని’ బహిరంగంగా చెప్పిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు పొలిటికల్ పాఠాలు నేర్పించడానికి దర్శకుడు కొరటాల శివ సిద్ధమవుతున్నాడని టాలీవుడ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఇప్పటివరకు ఓ రూమర్ గా భావించిన ప్రిన్స్ పొలిటికల్ ఎంట్రీ, దాదాపుగా ఖరారైనట్లే అన్న వార్త అభిమానులకు మరింత ఉత్సుకతను పంచుతోంది.

‘శ్రీమంతుడు’ సినిమా తర్వాత మరొకసారి కొరటాలతో జత కడుతున్న ప్రిన్స్ సినిమా షూటింగ్ జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా కధ అద్భుతంగా ఉంటుందని, ఓ యూనివర్సల్ కాన్సెప్ట్ తో ముందుకు రాబోతున్నామని దర్శకనిర్మాతలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆ కాన్సెప్ట్ మరేదో కాదు, అంతకు ముందు సోషల్ మీడియాలో హల్చల్ చేసినట్లుగా… ముఖ్యమంత్రి పాత్రలో ప్రిన్స్ కనిపించబోతున్నారని తాజాగా మరోసారి చక్కర్లు కొడుతున్న విషయం.

ADVERTISEMENT

అనుకోని పరిస్థితుల నేపధ్యంలో ముఖ్యమంత్రిగా మారిన ఓ సామాన్యుడు ప్రజలకు మంచి చేయాలనుకున్నా, అది సాధ్యం కాకపోవడం తదితర కమర్షియల్ అంశాలతో పాటు, సినీ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని జోడించి ఈ సినిమా కధను కొరటాల రూపొందించారని తెలుస్తోంది. చూడబోతుంటే… ప్రిన్స్ ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నాన్ని కొరటాల తలపెట్టినట్లుగా కనపడుతోంది. ఈ వార్తలతో మురుగదాస్ సినిమా కంటే కూడా కొరటాల సినిమాపైనే అభిమానులు ఉత్సాహం చూపుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా రివ్యూ: దేవకన్యలు సైతం కాపాడలేకపోయారు!

చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…

8 minutes ago

OTT Deal: The Key to Vishwambhara’s Release

Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…

33 minutes ago