Telugu

మహేష్ సాధారణ స్థితికి వచ్చారా!

కరోనా కాలం… ఆ పైన సోదరుడు మరణం… మహేష్ ఎంత కాలానికి కోలుకుంటారోనని అభిమానులు ఎంతో ఆవేదన చెందారు. ఈ మధ్యలోనే మేనల్లుడు మొదటి సినిమా రిలీజ్. బాధను దిగమింగుకుని సినిమా కోసం ఓ వీడియో బైట్ అయితే ఇచ్చారు గానీ, మహేష్ సాధారణ స్థితిలో లేరన్న విషయం ఆ వీడియోలో స్పష్టమైంది.

ఇది గడిచి కూడా పది రోజులు కావస్తోంది. మరి ప్రస్తుతం మహేష్ ఎలా ఉన్నారు? అన్న ఉత్సుకత సగటు అభిమానులకు ఉండడం సహజం. అందుకు నిదర్శనమే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఈ పిక్. ఓ రూమ్ నుండి బయటకు వస్తున్న మహేష్ మాత్రమే ఇందులో కనిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత సూపర్ స్టార్ కనపడడంతో అభిమానులు ఈ పిక్ ను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.

ADVERTISEMENT

కరోనా రాకమునుపు కూడా బహిరంగ ప్రదేశాలలో ఎప్పుడూ మాస్క్ ధరిస్తూ కనిపించే మహేష్, ఈ పిక్ లోనూ మాస్క్ తోనే కనిపించారు. అయితే సూపర్ స్టార్ ఇంకా సాధారణ స్థితికి వచ్చినట్లు అయితే కనపడడం లేదు. ‘సర్కార్ వారి పాట’ షూటింగ్ ఇంకా మిగిలి ఉన్న నేపథ్యంలో సెట్స్ లో పాల్గొనేటంత స్థాయిలో మహేష్ కోలుకున్నారని అయితే అనిపించడం లేదు.

ఇప్పటికే ‘సర్కార్ వారి పాట’ రిలీజ్ డేట్ ను ‘ఆచార్య’ సొంతం చేసుకోగా, ప్రస్తుతం అవుతోన్న ఆలస్యం, ఈ సినిమా విడుదల ఇంకెంత ముందుకు వెళుతుందో అన్న ఆందోళన మహేష్ అభిమానుల్లో నెలకొంది. అయితే అభిమానులకు ఆనందదాయకమైన అంశం ఏమిటంటే… ఈ ఆలస్యం వలన తెలుగుతో పాటు మరికొన్ని భాషలలో ఈ సినిమాను అనువదించి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Dhruv Rathee Alleges He Was Kidnapped From Home

YouTuber Dhruv Rathee has alleged that he was taken from his home on October 10…

8 minutes ago

Anirudh’s Paradise Failure Now Haunts Jailer 2 Hopes

Recently, the much-anticipated interview of Jailer with its cast and crew took place, during which…

38 minutes ago