
ప్రమోషన్ కోసం వాడిన ఈ పోస్టర్ లో అశేష జన సమూహంతో పాటు ఓ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటపుడు పలికే మాటలను పొందుపరిచారు. దీంతో ఇప్పటివరకు హల్చల్ చేస్తున్న “భరత్ అనే నేను” యొక్క సినిమా థీమ్ ఏమిటో చిత్ర యూనిట్ చెప్పకనే చెప్పింది. సినిమా కంటెంట్ కు, ప్రమోషన్ కు ఎక్కడా డివియేట్ కాకుండా కొరటాల ప్లానింగ్ చేసినట్లు స్పష్టంగా కనపడుతోంది.
బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ప్రిన్స్ అభిమానుల నిరీక్షణ ఏప్రిల్ 27తో నెరవేరేలా ఉందన్న నమ్మకాన్ని కలిగించడంలో ఈ ప్రమోషన్ పోస్టర్ దోహదపడిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, రవికేచంద్రన్ వదిలేసిన సినిమాటోగ్రఫీ బాధ్యతలను తిరు భుజాన వేసుకున్నాడు.
ఈ ప్రమోషన్ పోస్టర్ చూసిన తర్వాత మహేష్ బాబు అభిమానులకు నిజమైన సంక్రాంతి వచ్చినట్లయ్యింది. టైటిల్ ను ప్రస్తుతం రివీల్ చేయకపోయినా, ఇప్పటివరకు సందడి చేసిన “భరత్ అనే నేను” టైటిల్ ను మార్చకుండా ఉంటే చాలు అంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్. ఈ పోస్టర్ లో ఇచ్చిన ప్రమాణ స్వీకార పబ్లిసిటీని బట్టి, టైటిల్ లో ఎలాంటి ట్విస్ట్ లు ఉండకపోవచ్చు.
Ravi Teja is coming off the success of Irumudi, and it looks like the actor…
The makers of Chakkora – Lunar Love Bird have unveiled their first single “Addamla Cheyana,”…