
ప్రశ్న – ఒక సంవత్సరంన్నర్ర నుండి ట్రావెల్ అయిన సినిమాతో మీరు ఎలా బయటపడ్డారు?
పంచ్ – అందుకే ఫ్యామిలీతో కలిసి విడుదలకు ముందే ట్రిప్ వెళ్లి వచ్చా.
ప్రశ్న – రోజూ న్యూస్ పేపర్ చదువుతారా?
పంచ్ – ఎక్కువగా చదవను… మంచి విషయాలేమున్నాయ్..!
ప్రశ్న – ఇందులో జనాలను కష్టపెట్టే సీన్లు ఉన్నట్టున్నాయ్?
పంచ్ – రెండు రోజుల్లో సినిమా వస్తుంది కదండీ… చూడండి..!
ప్రశ్న – చంద్రబాబు పుట్టినరోజు కూడా ఏప్రిల్ 20వ తేదీనే
పంచ్ – ఇంకా మంచి రోజు, ఇంకా మంచి విషయం
ప్రశ్న – వంశీ పైడిపల్లి సినిమా ఎలా ఉంటుంది?
పంచ్ – బాగుంటది… జూన్ లో మొదలవుతుంది..!
ప్రశ్న – ఈ సినిమా షూటింగ్ కు అడ్డంకులు ఉన్నట్లున్నాయ్?
పంచ్ – ఇంతకీ మేం జూన్ లో షూటింగ్ చేయగలమా? లేదా?
ప్రశ్న – ‘1 నేనొక్కడినే’ హీరోయిన్ కు అవకాశాలు రాలేదు?
పంచ్ – ఆ అమ్మాయే చేయలేదండి… ఎవరికి తెలుసు..!
ప్రశ్న – మీ దృష్టిలో బెస్ట్ సిఎం?
పంచ్ – కాంట్రవర్సీ వద్దు సార్… ఇంకా రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది..!
ప్రశ్న – ఫంక్షన్ లో ఎన్టీఆర్ గారు చెప్పిన ఎక్స్ పెరిమెంట్స్ పై మీ కామెంట్?
పంచ్ – ఇంకా ఎక్స్ పెరిమెంట్స్ చేసే ఓపిక పోయిందండి… నాన్న గారి అభిమానులు ఇంటికొచ్చి కొట్టేలా ఉన్నారు.
ప్రశ్న – మీరు – చరణ్ – ఎన్టీఆర్ కలిస్తే ఏం మాట్లాడతారు?
పంచ్ – సినిమాలు తప్ప, మిగతావన్నీ!
ఇలా పంచ్ లతో ప్రిన్స్ మీడియా సమావేశం అంతా నిండిపోయింది. బహుశా చదివితే అంతగా రుచించకపోవేమో గానీ, ప్రిన్స్ నోటి వెంట వింటుంటే మాత్రం అక్కడున్న జర్నలిస్ట్ ల మాదిరి నవ్వుకోవడం మాత్రం ఖాయం. ఈ మీడియా మీట్ లో చెప్పినట్లు… సినిమా విడుదలకు ముందు ఓ చిన్న టెన్షన్ ఉండడం సహజమే, కానీ ‘భరత్ అనే నేను’ రిలీజ్ కు ముందు మాత్రం మహేష్ ఫుల్ కాన్ఫిడెన్సు గా కనపడుతుండడం అభిమానులకు పండగ లాంటి విషయం.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…