
దీని తరువాత మహేశ్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ న్యూ యార్క్ లో ఎక్కువగా జరగనుంది. అందువలన అక్కడి లొకేషన్స్ ను ఎంపిక చేశారు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు తెలుస్తోంది.
అశ్వనీదత్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. మొత్తానికి వచ్చే ఏడాది మహేశ్ బాబు నుంచి రెండు సినిమాలు రానున్నాయన్న మాట. ప్రిన్స్ అభిమానులకు ఇంతకు మించిన స్వీట్ న్యూస్ మరొకటి ఉండదని చెప్పడంలో సందేహం లేదు.
నాని కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా Paradise. ఆర్థికంగా కూడా ఈ సినిమా టీమ్‌కు చాలా కీలకం. అందుకే ప్రతి…
Many thought Bigg Boss 20 would not be as interesting as the earlier seasons, especially…