
మహేష్ షూటింగ్ లోకి అడుగు పెట్టకముందే ఎప్పుడూ ఏదొక అంశంతో ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఈ సినిమాలో మహేష్ కుమారుడు గౌతమ్ కూడా నటిస్తున్నాడంటూ పుకార్లు షికార్లు చేసాయి. తాజాగా ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ కు సరికొత్త మేకోవర్ ను కొరటాల సిద్ధం చేసారని తెలుస్తోంది. ఇప్పటివరకు కనిపించిన మహేష్ కు పూర్తి విరుద్ధంగా ఈ మేకోవర్ ఉండబోతుందట. మరి ఎలాంటి షాక్ ఇస్తాడో చూడాలి.
అలాగే ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అసెంబ్లీ సెట్ కూడా వేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారన్న విషయం అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ అసెంబ్లీ సెట్ వేయడంతో, మహేష్ కు సిఎం సీటు దాదాపుగా ఖరారైనట్లే. అందుకే ‘భరత్ అనే నేను’ సినిమా ఈ రేంజ్ లో హల్చల్ చేస్తోంది. ఈ కధను దాదాపుగా కోటి రూపాయలు వెచ్చించి కొరటాల కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…