
హై పిచ్ వాల్యూంలో “భరత్ అనే నేను” అంటూ మహేష్ చేసిన ప్రమాణ స్వీకారానికి అంతా ఫిదా అయ్యారు… ఇక పాలన ఎలా ఉంటుందా..? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆ పాలన కూడా అంచనాలను అందుకునే విధంగా కొరటాల శివ రూపొందిస్తే… మహేష్ బాబు అభిమానులకు పండగేనని చెప్పవచ్చు. ప్రమోషన్స్ పరంగా పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తుండడం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం.
ప్రమాణ స్వీకార ఆడియో విడుదల చేసిన కాసేపటికే “భరత్ అనే నేను” టైటిల్ లోగో కూడా విడుదల చేసారు. ప్రమాణ స్వీకార పదజాలంతో జనాలను మాత్రమే చూపిస్తూ విడుదల చేసిన ఈ లోగో కూడా ఆకర్షణీయంగా కనపడుతోంది. దీంతో ఈ సినిమా నెక్స్ట్ అప్ డేట్స్… టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూడడం అభిమానుల వంతవుతోంది. సినిమా మాత్రం ఏప్రిల్ 27 విడుదల!
Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…
Mythological subjects have managed to leave an impression on the audience over the last few…