
‘లై’ సినిమాను నిర్మించిన 14 రీల్స్ సంస్థకు ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న అనుబంధం తెలియనిది. అతి తక్కువ సమయంలో ఈ బ్యానర్లోనే మూడు సినిమాలు చేసిన ప్రిన్స్, ఇప్పుడు ఈ సంస్థ నిర్మించిన ‘లై’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేస్తారన్న టాక్ బలంగా వినిపించింది. సహజంగా నితిన్ సినిమాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తుంటారన్న విషయం తెలిసిందే. మరి శనివారం నాడు జరగబోతున్న ఈ వేడుకకు హాజరయ్యేది మహేష్ బాబా? పవన్ కళ్యాణా?
ఈ ఇద్దరిలో ఎవరు హాజరైనా హీరోగా నితిన్ పండగ చేసుకోవడం ఖాయం. ఎందుకంటే అంత పబ్లిసిటీ తన సినిమాకు జరుగుతుంది గనుక! కానీ ఈ వేడుకకు ఈ ఇద్దరిలో ఎవరు హాజరు కావడం లేదని సమాచారం. దీంతో మహేష్ వస్తున్నాడంటూ జరిగిన ప్రచారం ఉత్త పుకారే అని తేలిపోవడం, ఈ వార్తను అభిమానులు చాలా లైట్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ “భరత్ అనే నేను” సినిమాతో బిజీగా ఉండగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో పవర్ స్టార్ నిమగ్నమై ఉన్నారని సమాచారం.
ఈ ఇద్దరు కాకపోయినా… ప్రస్తుతం సక్సెస్ లో ఉన్న పలువురు యువ హీరోలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
For Congress, the November 1 rally at Delhi's Ramlila Maidan was an opportunity to show…
The Tiger Shroff firing incident appears to have changed more than just the security arrangements…