Telugu

‘స్క్రీన్ ప్రజెన్స్’లో మహేష్ ని మించిపోయేలా!

సితార… సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి. కానీ ఇప్పటికే ఒక సెలబ్రిటీ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇంస్టాగ్రామ్ నిత్యం సందడి చేసే సితార ఫాలోయర్స్ సంఖ్య టాప్ హీరోయిన్లకు చేరువలో ఉంటుంది. అంతలా సితార పాపులారిటీ ఉంది.

అలాంటి సితార మొదటిసారిగా మహేష్ బాబు ‘పెన్నీ’ సాంగ్ లో తళుక్కుమనడం అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని పంచింది. ఓ విధంగా చెప్పాలంటే… ఈ ప్రోమో సాంగ్ లో పాట కంటే, ఇంకా చెప్పాలంటే మహేష్ కంటే కూడా సితార పాప వేసిన స్టెప్పులు మెస్మరైజింగ్ గా ఉన్నాయి.

ADVERTISEMENT

ఆ స్టెప్పులతో పలికించిన హావభావాలు, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఫస్ట్ లుక్ లోనే ఎవరెస్ట్ మీద సితారను కూర్చోపెట్టాయి. దీంతో సోషల్ మీడియాలో సూపర్ స్టార్ అభిమానులంతా సితార స్టెప్పుల గురించే చర్చించుకుంటున్నారు. ఆ మాటకొస్తే ఒక్క మహేష్ ఫ్యాన్సే కాదు, ఈ ప్రోమో వీక్షించిన ప్రతి ఒక్కరిని తన స్క్రీన్ ప్రజెన్స్ తో సితార కట్టిపడేసింది.

‘1 నేనొక్కడినే’ ద్వారా సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయిన మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణకు లభించని ప్రశంసలు, 45 సెకన్ల ప్రోమోలో అలా కాసేపు కనిపించిన సితార పట్ల కురిపిస్తున్న పొగడ్తలకు లెక్క లేదు. ఈ ప్రోమోలో సూపర్ స్టార్ కూడా అదిరిపోయే రేంజ్ లో కనిపించారు గానీ, చిత్రీకరణ మాత్రం ‘అలా వైకుంఠపురం’ పాటను పోలి ఉందన్న విమర్శను మూటకట్టుకుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

MI vs GT: From Trolls to Hero, Hyderabad Star Shines

The 30th match of the Indian Premier League 2026 took place between Mumbai Indians and…

3 hours ago

Flops Turn Ram Desperate? Will He Take the Extreme Step?

A new trend is clearly emerging in Telugu cinema, with more actors stepping into direction…

3 hours ago