
‘1 నేనొక్కడినే’ తర్వాత సుకుమార్ – మహేష్ బాబులు కలిసి సినిమా చేయబోతున్నామని, ఇద్దరూ అధికారికంగా వెల్లడించారు. ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ, “కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన సుకుమార్ తో సినిమా చేయడం లేదని” స్వయంగా మహేష్ నుండి ట్వీట్ వచ్చింది.
ఆ వెంటనే సుకుమార్ – బన్నీ కాంబోలో “పుష్ప” ప్రకటన వెలువడింది. దీంతో మహేష్ మిస్ చేసిన సినిమాను బన్నీ చేయబోతున్నాడని సినీ ప్రేక్షకులు, ఇద్దరు హీరోల అభిమానులు భావించారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో సుకుమార్ లేక మహేష్ చెప్పాలి.
“పుష్ప” ట్రైలర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా కూడా మొదలైంది. ‘అలా వైకుంఠపురం’ Vs ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా నుండి ఈ ఇద్దరి హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు తెగ రచ్చ చేసుకుంటున్న వైనం నెటిజన్లకు సుపరిచితమే.
“పుష్ప” వదులుకుని మహేష్ మంచి పనే చేసారంటూ తాజాగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇందుకు కారణం “పుష్ప”లో అల్లు అర్జున్ గెటప్ లో మహేష్ బాబుని ఊహించుకోవడం అసాధ్యం. ఒకవేళ ‘పుష్ప’ రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ కొట్టినా, ఈ క్యారెక్టర్ మహేష్ కు 1% కూడా సెట్ అవ్వదనేది వీరి భావన.
బహుశా ఈ రోల్ తనకు సూట్ అవ్వదని ప్రిన్స్ కూడా పక్కాగా ఉన్నారో ఏమో గానీ, మహేష్ తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. అలాగే ‘ఆచార్య’లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను కూడా మహేష్ పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఇలా ఇద్దరు మెగా హీరోల రోల్స్ ను సూపర్ స్టార్ సున్నితంగా రిజెక్ట్ చేయడం విశేషం.
అనుభవం నేర్పిన పాఠం అనుకుంటా… కెరీర్ తొలినాళ్ళల్లో “బాబీ, నాని, నిజం” వంటి సినిమాల విషయంలో వేసిన తప్పటడుగుల నుండి మహేష్ నేర్చుకున్నట్లు కనపడుతున్నారు. అందుకే ఇటీవల కాలంలో తనకు సూట్ అయ్యే రోల్స్ నే ఎంపిక చేసుకుంటున్నారు, అవి కమర్షియల్ సబ్జెక్టు అయినా! సోషల్ సబ్జెక్టు అయినా!
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…