
మొన్నటివరకు ‘టైటిల్’ మరియు ‘ఫస్ట్ లుక్’ల గురించి కమెడియన్ ప్రియదర్శన్ దగ్గర నుండి సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ వరకు సినిమా యూనిట్ తో సంబంధం ఉన్న వారిని, లేని వారిని అన్న తారతమ్యం లేకుండా తమ ప్రశ్నలతో వేటాడిన ప్రిన్స్ అభిమానులు, తాజాగా ‘స్పైడర్’ టీజర్ గురించి కూడా అదే రకమైన ప్రశ్నల సునామీని కురిపిస్తున్నారు. తాజాగా పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి ట్వీట్ చేస్తూ… ‘స్పైడర్’కు సంబంధించి మరో పాట ఫైనల్ అయ్యింది అని స్పష్టం చేసారు. గతంలో కూడా ఇలాగే ‘స్పైడర్’ పాట పూర్తి చేసినపుడు ట్వీట్ చేసారు.
అయితే టీజర్ సంగతులు తెలుసుకునే ఆరాటంలో ఉన్న ప్రిన్స్ అభిమానులు… టీజర్ రిలీజ్ డేట్ మీకు తెలుసా? టీజర్ ఎప్పుడు విడుదల అవుతోంది? అంటూ శాస్త్రి గారిని ప్రశ్నలతో ముద్ద చేస్తున్నారు. ఒక్క రామజోగయ్య పరిస్థితే కాదు, “స్పైడర్”కు సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులంతా ఇదే రకమైన ప్రశ్నలను చవిచూస్తున్నారు. అయితే అభిమానులు ఇంతలా ప్రాధేయపడుతున్నా… చిత్ర నిర్మాణ సంస్థ నుండి గానీ, దర్శకుడు మురుగదాస్ నుండి గానీ, ప్రిన్స్ నుండి గానీ ఒక్క అధికారిక సమాచారం వెలువడడం లేదు.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…