
“జనగణమన” పేరుతో ‘పోకిరి, బిజినెస్ మెన్’ల కంటే రెట్టింపైన పవర్ ఫుల్ పాత్రతో మహేష్ రాబోతున్నాడంటూ పూరీ చేసిన ట్వీట్ తో ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఒక్క ప్రిన్స్ అభిమానుల నుండే కాదు, సినీ సెలబ్రిటీల నుండి కూడా “జనగణమన” ప్రకటనపై అపూర్వ స్పందన లభిస్తోంది.
‘టైటిల్ అదిరిపోయింది… ఒళ్ళు పులకరిస్తోంది…’ అంటూ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ట్వీట్ చేయగా, ‘సూపర్’ అంటూ నటుడు బ్రహ్మాజీ, ‘వూయ్ లవ్ ఇట్’ అంటూ మరో సంగీత దర్శకుడు థమన్, ‘జనగణమన మీరు పాడండి, జెండా ఫ్యాన్స్ పాతేంగే’ అంటూ సంపూ ట్వీట్లు చేసారు.
ఈ ప్రకటనపై స్పందించిన మహేష్ బాబు… “మరొక మెమరబుల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ పూరీకి ట్వీట్ చేసారు. మహేష్ – పూరీ కాంభినేషన్ లో ‘పోకిరి, బిజినెస్ మెన్’ల తర్వాత హ్యాట్రిక్ సినిమాగా “జనగణమన” సినిమా రాబోతున్న నేపధ్యంలో భారీ అంచనాలు ఏర్పడడం సహజమే. ఇక, రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చదివితే… ప్రిన్స్ ఫ్యాన్స్ కు అంతే సంగతులు… “జనగణమన కధ యాక్షన్ ఎంటర్టైనర్స్ లో కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేయడం ఖాయం, హీరోయిజంలో హిమాలయాల స్థాయిలో ఉంటుందని” చెప్పి మరింత ఉత్సాహం పెంచారు.
Aadarsha Kutumbam marks the long-awaited collaboration between Trivikram and Venkatesh arriving after a 22-year wait!…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…