
‘మహేష్ అన్న లాంటి వ్యక్తి ఓ అరుదైన రకం…. ఆయనను అలాగే ఉంచుదాం… తన కెరీర్ లో చేసినన్ని ప్రయోగాలు ఏ స్టార్ హీరో కూడా చేయలేదని, ఒక రకంగా ఆయనను చూసి మేమంతా ఇప్పుడిప్పుడు ప్రయోగాలు చేస్తున్నామని, ఒక రకంగా మా ప్రయోగాలకు ఆయనే స్ఫూర్తిదాయకం” అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ ఈగోలకు అతీతంగా, రియాలిటీకి చాలా దగ్గరగా ఉండడం విశేషం.
ఇక మైక్ అందుకున్న మహేష్…. ‘కృష్ణగారబ్బాయి అనే నేను’ అంటూ మొదలుపెట్టి, తమ్ముడు తారక్ వలనే ఇలాంటి మాటలు నేర్చుకున్నానని చమత్కరించాడు. ఎలాంటి ఓవర్ డైలాగ్స్ లేకుండా చేసిన ప్రసంగాలు సినీ ఇండస్ట్రీలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించగా, ‘మేం మేం బాగానే ఉంటాం, మాలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను’ అని సినీ ప్రేక్షకులకు ఓ సందేశాన్ని కూడా ఇచ్చాడు ప్రిన్స్.
సినీ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే డైలాగ్స్ అక్కడితో ఆపలేదు, “ట్రెండ్ మారింది… ఇక మున్ముందు పెద్ద సినిమాలకు అందరూ అగ్ర హీరోలు వస్తుంటారు” అంటూ చెప్పిన మాటలు భవిష్యత్తు కాంబోలపై అంచనాలను పెంచాయి. ఈ వేడుక అయిన తర్వాత రామ్ చరణ్ కూడా జాయిన్ అవ్వడం విశేషం. ప్రస్తుతం మహేష్ – ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…