
2017, సెప్టెంబర్ 22వ తేదీన కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న “భరత్ అనే నేను” సినిమా విడుదల కానుందన్న సమాచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. అంటే పక్కా ప్రణాళికతో కొరటాల మరోసారి రంగంలోకి దూకబోతున్నారని స్పష్టమవుతోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారన్న ఒకే ఒక్క విషయంతో ఈ సినిమాకు ఇప్పటికే ఆశించిన దాని కంటే ఎక్కువ పబ్లిసిటీనే జరిగింది. అయితే తాజాగా వెలువడుతున్న రిలీజ్ డేట్ తో మరింత సోషల్ మీడియాలో నానుతోంది.
ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న మురుగదాస్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్నది ఇప్పటివరకు స్పష్టత లేదు. ఏప్రిల్ మొదటి వారంలో అని అనుకున్నప్పటికీ, అది కాస్త జూన్ కు వాయిదా పడిందని ఇటీవల ఫిల్మ్ అప్ డేట్స్ వచ్చాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో గానీ, షూటింగ్ దశలో ఉన్న తాజా సినిమా సమాచారం తెలియకుండా, రెండు నెలల్లో షూటింగ్ ప్రారంభం అవుతుందన్న సినిమా విడుదల తేదీ రావడం ఆశ్చర్యకరమైన విషయమే.
The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…
గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…