
అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ లైన్ సోషల్ అండ్ వెబ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. “ప్రతి మనిషి తనను తాను ప్రేమించుకోవడంలోనే అసలైన ఆనందం దాగి ఉందని,” ఈ థీమ్ ను ప్రిన్స్ నోటి ద్వారా కొరటాల చెప్పించబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిని వింటూ, చెప్తూ నవ్వుకోవడం నెటిజన్ల వంతవుతోంది. ‘ఈ సినిమాలో ఓ సరికొత్త ఏమోషన్ ను ట్రై చేస్తున్నామని మాత్రమే’ కొరటాల చెప్పగా, దీనిని ఆధారంగా చేసుకుని పలువురు ఔత్సాహికులు ఈ సందేశాన్ని అల్లేసినట్లుగా స్పష్టమవుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కాకుండానే, ఈ సినిమా కధ ఇదేనని చెప్పడం మరింత విడ్డూరంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో లీకులు సర్వసాధారణంగానే మారాయి గానీ, మరీ స్క్రిప్ట్ వర్క్ జరగకుండా కధలు అల్లేయడం ఇదే మొదటిసారేమో! మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తానని కొరటాల స్పష్టంగా చెప్పడంతో ఈ వార్తలు పూర్తి హాస్యాస్పదంగా మారాయి.
Nabha Natesh turns classic Indian glamour into a striking fashion statement with this fiery rust…
Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…