
సిల్వర్ స్క్రీన్ అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించే ఈ తరం నటులలో ముందు వరుసలో ఉండే ప్రిన్స్ నుండి, బయో టెర్రరిజం నేపధ్యంలో తెరకెక్కుతోన్న “స్పైడర్” సినిమా కోసం అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ స్టిల్ మాత్రం సింపుల్ లుక్ లో అమాయకంగా ఎవరినో చూస్తున్నట్లుగా కనపడుతోంది. ఓ దేవాలయంలో ఈ షాట్ ను చిత్రీకరించారని వెనుక గోడలు, పక్కన పూలు స్పష్టం చేస్తున్నాయి.
మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించారు. మొత్తం 5 పాటలున్న ఆల్బమ్ ఆగష్టు నెలాఖరున విడుదల కానుండగా, ఆగష్టు 9న మాత్రం సినిమా కంటెంట్ ను బయటపెట్టే టీజర్ రాబోతోంది. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడం ఖరారు కాగా, హిందీ భాషలో రిలీజ్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…