
కెరీర్ మొదలుపెట్టిన ‘రాజకుమారుడు’ నాటి నుండి, లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ వరకు కధల పరంగా మహేష్ బాబు అనేక ప్రయోగాలు చేశారు గానీ, లుక్స్ పరంగా ఒకటి, రెండు సినిమాలు మినహాయిస్తే, మిగిలిన అన్ని చిత్రాలలో దాదాపుగా ఒకే విధంగా ఉన్నారు.
విభిన్నమైన కధల ఎంపిక మహేష్ బాబుని ‘ప్రిన్స్’ నుండి ‘సూపర్ స్టార్’ను చేసింది. ఇప్పటివరకు జరిగింది ఓ కధ అయితే, రాజమౌళితో సినీ ప్రస్థానం మొదలు కాకముందే అంచనాలు ఆకాశాన్ని తాకే విధంగా మహేష్ బాబు లుక్స్ ఉన్నాయి.
అభిమానులకైతే కన్నుల పండుగ మాదిరి మహేష్ బాబు తాజా చిత్రాలు దర్శనమివ్వడంతో, సోషల్ మీడియా అంతటా సూపర్ స్టార్ ట్రెండింగ్ లోకి వచ్చేశారు. ‘కేజీఎఫ్’లో రాకీ భాయ్ మాదిరి పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో మహేష్ బాబు రఫ్ లుక్ కట్టిపడేస్తోంది.
ఇటీవల వరద సాయం నిమిత్తం ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలకు చెరొక 50 లక్షల రూపాయలను మహేష్ బాబు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నేడు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ – నమ్రతలు 50 లక్షల చెక్కును అందజేశారు.
అలాగే తను పార్టనర్ గా వ్యవహరిస్తోన్న ‘ఏఎంబి సినిమాస్’ తరపున మరొక 10 లక్షల రూపాయల చెక్కును కూడా మహేష్ బాబు ఈ సందర్భంగా అందజేశారు. మహేష్ అందించిన సాయం కంటే, తమ అభిమాన హీరోని ఇలా చూసి మురిసిపోవడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వంతయ్యింది.
దసరా సందర్భంగా ప్రెస్ మీట్ తో ‘ఎస్ఎస్ఎంబి 29’ డీటైల్స్ మొత్తం ప్రకటిస్తారన్న ఆశతో అభిమానులు ఉండగా, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చిత్ర యూనిట్ కు సంబంధించిన వారు కూడా ఇటీవల కాలంలో ఈ సినిమా కబుర్లపై పెదవి విప్పలేదు.
దీంతో అనుకోకుండా తగిలిన ‘లాటరీ’ మాదిరి, మహేష్ బాబు మీడియా కంట పడడంతో సూపర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం అభిమానుల ముఖచిత్రాలన్నీ వెయ్యి వాట్ల బల్బుల మాదిరి ఓ రేంజ్ లో వెలిగిపోతున్నాయి.
A blockbuster in one language creates curiosity in other markets, but that excitement doesn't last…
Aadi Saikumar, who last appeared in Shambhala, is gearing up for a new project with…