
అయితే తాజాగా లభిస్తున్న సమాచారం ప్రకారం ప్రిన్స్ సరసన “నేను… శైలజ…, నేను లోకల్” సినిమాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లుగా టాక్. ఈ రెండు సినిమాలు కాకుండా తమిళంలో నటించిన ‘రెమో’ కూడా తెలుగులోకి అనువాదం అవుతోంది. ఇటీవల విడుదలైన ‘నేను లోకల్, రెమో’ సినిమాల టీజర్, ట్రైలర్స్ లో కీర్తి సురేష్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయన్న టాక్ వెలువడడంతో, ప్రిన్స్ సరసన కీర్తి ఎంపిక పట్ల అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అధికారికంగా ఈ సమాచారాన్ని వెల్లడిస్తే… ప్రిన్స్ నటించబోయే 24వ సినిమాలో హీరోయిన్ పై స్పష్టత వచ్చినట్లే. మరి సదరు వివరాలను దర్శకుడు కొరటాల తెలియజేస్తారో, నిర్మాత డివివి దానయ్య తెలుపుతారో గానీ ప్రిన్స్ ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రిన్స్ సినిమా నుండి ఆఫర్ అని చెప్పగానే మరో ఆలోచన లేకుండా కీర్తి ఒప్పుకున్నట్లు కూడా ఈ వార్తల సారాంశం.
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…