Telugu

ప్రిన్స్ అభిమానులకు షాకింగ్ న్యూస్..!

అతి తక్కువ కాలంలోనే టాప్ సంగీత దర్శకుడుగా ఎదిగిన ఎస్.ఎస్.థమన్, అంతే తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేయగల సమర్ధుడు. అలాంటి థమన్ – మహేష్ బాబు కాంభినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదల కాగా, ‘దూకుడు, బిజినెస్ మెన్’ సినిమాలు సూపర్ హిట్ కాగా, ‘ఆగడు’ మాత్రం ఆగిపోయింది. తాజాగా సమాచారం మేరకు వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతోంది.

అవును… ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించబోయే సినిమాకు థమన్ తన బాదుడును చూపించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇది ఏ సినిమాకు అన్నది మిక్కిలి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నటిస్తున్న మురుగదాస్ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా, కొరటాల శివ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఖరారయ్యాడు. మరి థమన్ లిస్టులో ఉన్న ప్రిన్స్ మూవీ ఏంటన్నది తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT

బహుశా మహేష్ నటించబోయే 25వ సినిమాకు ఇప్పటికే థమన్ బుక్ అయ్యాడా? ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు అన్న టాక్ వినపడుతున్న నేపధ్యంలో ‘మాటల మాంత్రికుడు – థమన్’ కాంభినేషన్ ను ప్రిన్స్ సెట్ చేయబోతున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. త్రివిక్రమ్ తాజా సినిమాకు దేవి స్థానంలో అనిరుధ్ ను తీసుకున్న నేపధ్యంలో… మహేష్ మూవీకి బహుశా థమన్ ఎంపిక అయ్యి ఉండవచ్చన్నది ఓ టాక్.

అయితే థమన్ ను ఎంపిక చేసుకోవడం పట్ల ప్రిన్స్ అభిమానులు ఒకింత నిరుత్సాహంగా ఉన్నారు. ఇటీవల కాలంలో థమన్ సంగీతం అందించిన సినిమాలను పరిశీలిస్తే… ఆయా సినిమాలలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నా, పాటలను మాత్రం కర్ణకటోరంగా ఉంటున్నాయి. అయితే థమన్ కు కలిసొచ్చే అంశం ఏమిటంటే… పాటలు ఎలా ఉంటున్నా ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడుతుండడం! అయితే ఇప్పటివరకు మహేష్ కు చేసిన మూడు సినిమాలకు థమన్ మంచి పాటలనే అందించడం ఒకింత ఊరటనిచ్చే అంశం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

OTT Deal: The Key to Vishwambhara’s Release

Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…

9 minutes ago

కొండా అడుగులు ఎటువైపు.?

కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో…

31 minutes ago