
వంశీ పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రిన్స్, తన తదుపరి సినిమా కోసం మీతో పని చేయడానికి ఎదురుచూస్తున్నాను… అంటూ ప్రిన్స్ చేసిన ట్వీట్ కు ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు వంశీ. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి ట్విస్ట్ లు లేవని, ముందుగా అనుకున్నట్లే… మహేష్ 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే ఉంటుందని స్పష్టమైంది. ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్ మరియు దిల్ రాజులు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా జనవరి నుండి సెట్స్ పైకి వెళ్తుందని ఇటీవల్ దిల్ రాజు కూడా ఖరారు చేసారు.
నిజానికి ఈ గందరగోళం అంతా ఇటీవల బోయపాటి చేసిన ప్రకటనతో వచ్చింది. ప్రస్తుతం “జయ జానకి నాయక” సినిమా చేస్తున్న బోయపాటి, తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నానన్న ప్రకటనతో, వంశీ సినిమాపై సందేహాలు నెలకొన్నాయి. ఆగష్టులో బోయపాటి సినిమా విడుదల కానుందని, మిగిలిన నాలుగు నెలలు స్క్రిప్ట్ పై దృష్టి జనవరి నుండి బోయపాటి – మహేష్ ల సినిమా మొదలు కావచ్చని పుకార్లు పుట్టుకొచ్చాయి. మొత్తానికి వంశీ పుట్టినరోజు నాడు ప్రిన్స్ ఇచ్చిన కానుకగా ఈ ట్వీట్ ను పేర్కొనవచ్చు.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…