Telugu

మహేష్ బాబుకు వర్మ డేంజర్ బెల్స్!

మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న “స్పైడర్” ఫస్ట్ లుక్ వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఈ ఫస్ట్ లుక్ టాపిక్ లోకి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తలదూర్చారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు, వినాయకస్వామి భక్తులకు క్షమాపణలు చెప్పి, తానూ మారిపోయానని చెప్పిన వర్మ, ఈ ‘స్పైడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ప్రశంసలు కురిపించారు. ఎంతగా అంటే… మహేష్ నిజంగా దేవుడిలా ఉన్నాడంటూ కీర్తించాడు.

వర్మ ఇంతలా పొగిడితే డేంజర్ ఏముంటుంది? అనుకుంటున్నారా..! కొందరు పొగిడితే అది సింగిల్ మీనింగే… అదే వర్మ లాంటి వాళ్ళు పొగిడితే… అవి డేంజర్ సిగ్నల్స్ అని చెప్పవచ్చు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో అభిమానులు వర్మ సిద్ధాంతాన్ని రుచిచూసారు. తాజాగా మహేష్ ఫ్యాన్స్ వంతు వచ్చినట్లుగా కనపడుతోంది. ఏదైనా పవన్ పోస్టర్లు, టీజర్లు వచ్చాయంటే… ముందుగా వాటిని ఆకాశానికేత్తేయడంలో వర్మ ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

ఇక్కడ ఎంతగా ప్రశంసలు కురిపిస్తారో, సినిమా విడుదలైన తర్వాత అంతకు మించిన స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సందిస్తూ… సదరు హీరోకు, అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తారు. గతంలో పవన్ ను దేవుడు అన్నట్లే… ఇప్పుడు మహేష్ పోస్టర్ ను చూసి దేవుడు గెటప్ అంటున్నాడు. ఇప్పుడు పొగిడిన అదే దేవుడుని, తర్వాత ఏ రేంజ్ లో ఆడుకోవాలో వర్మకు తెలిసినంతగా మరొకరికి తెలియదని చెప్పడంలో సందేహం లేదు. దీంతో వర్మ నుండి ఎన్ని తక్కువ ప్రశంసలు లభిస్తే… ఆ హీరోకు, ఆ సినిమాకు తర్వాత అంత లాభం అన్న మాట!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కొండా సురేఖ: కొండ నాలుకకు మందేస్తే…

మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…

9 minutes ago

Revanth @ Hyderabad: Konda Surekha In Focus!

The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…

13 minutes ago