
చాలాకాలం నుండి నిరీక్షిస్తోన్న ఈ ఆల్బమ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఈ ఆల్బమ్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న థమన్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచే విధంగా పాటలను రూపొందించారా? లేదా? అన్నది తెలియాలంటే మరో వారం రోజులైనా వెయిట్ చేయాల్సిందే.
అయితే ఏ సినిమాకైనా ఫస్ట్ సాంగ్ ప్రమోషన్ చాలా కీలకం. ‘పుష్ప’ సినిమాలో ‘దాక్కో దాక్కో మేక’ మొత్తం ఆల్బమ్ హిట్ కు దారి వేసింది. అలాగే ‘అఖండ’ సినిమాకు ముందుగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి ఆ టెంపోను అలాగే మైంటైన్ చేసారు. ‘ఆచార్య’ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ‘లాహే లాహే’ సాంగ్ కూడా సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది.
పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ నుండి ముందుగా విడుదలైన టైటిల్ సాంగ్ ఫ్యాన్స్ ను ఒక ఊపు ఊపి, ఆ తర్వాత వచ్చిన పాటలకు బాట వేసింది. దీంతో “సర్కార్ వారి పాట” నుండి రాబోయే మొదటి పాట ముందుగా ఫ్యాన్స్ ను మెప్పించే విధంగా ఉండాలి. ఎందుకంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు నచ్చకపోతే, ఇతర హీరోల అభిమానులకు అవకాశం ఇవ్వకుండా ముందు వాళ్లే ట్రోల్స్ చేసుకుంటారు.
అందులోనూ మహేష్ కు ఉన్న మరో చిక్కు ఏమిటంటే, ఓ వర్గం అభిమానులు మహేష్ నుండి ఏది వచ్చినా దానిని అంగీకరిస్తారు. అలాగే మహేష్ నుండి మాస్ కోరుకునే ఫ్యాన్స్ కు మాత్రం ఓ పట్టాన ఏది రుచించదు. దీంతో వీరిద్దరిని సంతృప్తి పరిచేలా ప్రమోషన్ మెటీరియల్ ఉందా? లేదా? అనేది చూడాలి. ఏదైనా సంక్రాంతికి రాబోతున్న సర్కార్ వారి సాంగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ కావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…