
వీటిపై ప్రిన్స్ క్లారిటీ ఇచ్చారు. ‘భరత్ అనే నేను’ సూపర్ సక్సెస్ తర్వాత మొదటిసారిగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “అవును సుకుమార్ తోనే తన తదుపరి సినిమా ఉంటుంది. ‘1 నేనొక్కడినే’ పరాజయం పాలైనప్పటికీ, మంచి అభినయం ప్రదర్శించిన సినిమాలలో అది ఒకటని, కాస్త ఎడిటింగ్ కు టైం ఇచ్చి ఉంటే సినిమా బాగా ఆడేదన్న ఫీలింగ్ తనలో ఉందని, ఈ సారి ప్రయోగం కాదు, పక్కా కమర్షియల్ సబ్జెక్ట్” అంటూ స్పష్టం చేసారు.
ఇటీవల ‘రంగస్థలం’ చూసి ట్వీట్ కూడా చేశాను, కొత్తగా గ్రామీణ నేపధ్యం ఎంచుకుని ఎలా అయితే సక్సెస్ అందుకున్నారో, మా ‘భరత్ అనే నేను’ కూడా పొలిటికల్ నేపధ్యం ఎంచుకుని సక్సెస్ అయ్యామని అన్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు గానీ, అయితే వాటితో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలని ఆశిస్తారని, నా తప్పులను తెలుసుకున్నాను, మున్ముందు మంచి సినిమాలు చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు ప్రిన్స్.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు మెజార్టీ సీట్లు దక్కించుకుంటే వార్త అవుతుంది తప్ప అధికార పార్టీ దక్కించుకుంటే కాదు.…
A Simbu film usually creates enough curiosity, but the latest buzz around his next project…