
అవును… ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మల్టీస్టారర్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సమయంలో మహేష్ ప్రవర్తన గురించి అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు. అయితే ఆ గొప్పతనం రోజురోజుకు మరింత పెరుగుతుందే తప్ప, తగ్గడం లేదని తాజా ఇంటర్వ్యూల ద్వారా స్పష్టమవుతోంది. “స్పైడర్” సినిమాను ఇండియన్ స్క్రీన్ పై మహేష్ తప్ప మరొకరు చేయలేరు అని మురుగదాస్ చెప్పినపుడు మీకేమనిపించింది… అని యాంకర్ ప్రశ్నించగా… అది ఆయన గొప్పతనం, తనను అలా భావించడం, కానీ నేను చెప్తున్నానుగా, అది ఎవరైనా చేయవచ్చు… అలాంటిదేమీ లేదు అంటూ వినమ్రంగా చెప్పడం బహుశా మహేష్ ఒక్కడికే చెల్లిందని చెప్పాలి.
అలాగే పొలిటిక్స్ కు దూరంగా ఉన్నప్పటికీ, వైఎస్సార్ గురించి ఓ ప్రశ్న వేయగా, రాజకీయాలను పక్కన పెడితే, నాన్న గారితో పాటు ఓ సారి వైఎస్సార్ ను ఓ సారి కలిసానని, చాలా మంచి వ్యక్తి అని కుండబద్దలు కొడుతూ చెప్పారు. ఆ సమయంలో జగన్ గారు కూడా అక్కడే ఉన్నారని అన్నారు. ఇలా ప్రశ్న ఏదైనా… కల్మషం లేకుండా, ఆఫ్ స్క్రీన్ లో తన నటనను చూపించకుండా… తన మనసులో ఉన్న వ్యాఖ్యలను చెప్పడం అనేది ప్రిన్స్ స్టైల్ గా మారింది. ఇంతేనా… చెప్పుకుంటే ఇంకా చాలా ఉంది… ప్రస్తుతం నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారి స్మాల్ స్క్రీన్ పైన కూడా సందడి చేస్తున్నారు. మీకు ఆ ఉద్దేశం లేదా? అంటే…
మహేష్ ఏం చెప్పాడంటే… అంతటి ప్రతిభ కనపరచడానికి చాలా టాలెంట్, సమయస్పూర్తి ఉండాలి, నిజంగా చెప్తున్నాను… అది నా దగ్గర లేదనే భావిస్తున్నాను, నాకు సినిమాలు చాలు ఇంకేం అవసరం లేదు, ముసలితనం వచ్చే వరకు కూడా నటిస్తూ ఉంటే చాలని కాస్త చమత్కరించాడు. నిజమే… మహేష్ ను ఓ టీవీ హోస్ట్ గా ఊహించుకోలేం, ఎందుకంటే వీటన్నింటికి అతీతంగా ప్రిన్స్ వ్యవహారశైలి ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం అనేది ఏ హీరో కూడా చేయరు. ఆ ప్రవర్తనే ఇతర హీరోల నుండి ప్రిన్స్ ను వేరు చేస్తోంది… జయాపజయాలతో నిమిత్తం లేకుండా “దటీజ్ మహేష్…” అంటూ ప్రతి అభిమాని కాలర్ ఎగరేసుకునేలా చేస్తోంది..!
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…