
తెలుగులో 2 గంటల 25 నిముషాలుగా ఉన్న ‘స్పైడర్’ సినిమా, తమిళంకు వచ్చేసరికి మరో నిముషం పెరిగిందన్న విషయం తెలిసిందే. అయితే మలయాళంలో 27నే విడుదల చేస్తారా? లేక మరో వారం ఆగి విడుదల చేస్తారో అనేది మాత్రం చిత్ర యూనిట్ కూడా ప్రకటించలేదు. ముందుగా చెప్పిన ప్రకారం అయితే తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు అరబిక్ లోనూ ఈ సినిమాను డబ్ చేసి, బుధవారమే విడుదల చేయనున్నారు. అరబిక్ విషయం పక్కన పెడితే దక్షిణాది మలయాళంపై ప్రకటన రాలేదు.
ప్రమోషన్ పోస్టర్లు గానీ, వీడియో టీజర్లు గానీ కేవలం తెలుగు, తమిళంకు సంబంధించే విడుదల చేస్తున్నారు తప్ప, మలయాళంలో విడుదల చేయకపోవడంతో, ఈ వర్షన్ పై పునరాలోచించారా? లేక డబ్బింగ్ కు మరికొంత సమయం పడుతుందా? ఏది ఏమైనా మూడు భాషలలో విడుదలవుతోందని ప్రిన్స్ అభిమానులు సంబరాలు చేసుకున్న తరుణంలో… మలయాళం మాత్రం డౌటేనని చెప్పవచ్చు. అయితే విడుదలైన రెండు భాషలలో కూడా ఘనవిజయం సాధిస్తే… అదే పది వేలు… అంటున్నారు అభిమానులు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…